Telangana Elections: హైదరాబాదులో ఆరున్నర కోట్ల నగదు స్వాధీనం

ఈ డబ్బు ఖమ్మం జిల్లాకు చెందిన ఒక నేతకు సంబంధించినదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ డబ్బును కర్ణాటక నుంచి హైదరాబాద్ తీసుకువస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Telangana Elections: హైదరాబాదులో ఆరున్నర కోట్ల నగదు స్వాధీనం

Updated On : November 18, 2023 / 5:27 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ శనివారం భారీగా నగదు పట్టుబడింది. హైదరాబాద్ లోని బండ్లగూడ అప్పా జంక్షన్ వద్ద ఆరున్నర కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తనిఖీల్లో భాగంగా ఆరు కార్లలో ఈ డబ్బును తరలిస్తుండగా పట్టుబడినట్లు వారు పేర్కొన్నారు. ఈ డబ్బు ఖమ్మం జిల్లాకు చెందిన ఒక నేతకు సంబంధించినదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ డబ్బును కర్ణాటక నుంచి హైదరాబాద్ తీసుకువస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చనప్పటి నుంచి లెక్కలు లేని డబ్బు ఇలా పెద్ద మొత్తంలో పట్టుబడుతోంది. ఎన్నికల నేపథ్యంలో ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పట్టుకోవడం ఇదే తొలిసారి.