Assembly Elections 2023: బీజేపీ కంచు కోటలో కాంగ్రెస్ హల్ చల్.. ఛత్తీస్‌గఢ్ ఈసారి బీజేపీకి ఎందుకంత కీలకం?
భూపేష్ బాఘేల్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకోవస్తోంది. వచ్చే నెలలో రెండు దశల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తదుపరి అధికారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది

Chhattisgarh Politics: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం 2000 సంవత్సరంలో ఏర్పడింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉన్న ఆ ప్రాంతాన్ని అప్పటి అటల్ బిహార్ వాజిపేయి ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2003లో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎన్నికలు జరిగాయి. ఇక అప్పటి నుంచి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీదే జోరు. అప్పటి నుంచి దాదాపు 15 ఏళ్ల పాటు ఆ రాష్ట్రానికి రమణ్ సింగే ఏకైక ముఖ్యమంత్రి. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ అధికారంలో ఉండేది బీజేపీనే, ముఖ్యమంత్రి రమణ్ సింగే. అలా మారిపోయింది రాష్ట్ర రాజకీయం.
కానీ 2018లో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ ఎన్నికల్లో 90 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 68 స్థానాలతో సాధించి బీజేపీకి దారుణ పరాభవాన్ని ఇచ్చింది. భూపేష్ బాఘేల్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకోవస్తోంది. వచ్చే నెలలో రెండు దశల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తదుపరి అధికారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికి విడుదలైన సర్వేలు కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా సూచిస్తున్నాయి. స్పష్టమైన మెజారిటీ కాంగ్రెస్ పార్టీకే వస్తుందని చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి: Assembly Elections 2023: రాజస్థాన్‌లో ఆ రికార్డ్‌ను కాంగ్రెస్ బీట్ చేస్తుందా? బీజేపీ పరిస్థితి ఏంటి?
రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి గట్టి పట్టున్న ఛత్తీస్‌గఢ్.. తమ చేతుల్లో నుంచి పోవడం బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బ. అయితే ఈసారి దీన్ని నిలబెట్టుకోవడం బీజేపీకి అత్యంత ప్రాధాన్యంగా మారింది. ఈసారి కూడా ఇక్కడ బీజేపీ ఓడిపోతే ఆ ప్రభావం మహారాష్ట్రలోని విద్భ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలపై చాలా ఎక్కువ పడుతుంది. విదర్భలోని ప్రధాన నగరమైన నాగ్‌పూర్, బీజేపీ సైద్ధాంతికి మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ కు కేంద్ర కార్యాలయం. ఇక బీజేపీ మొదటి సారి అధికారంలోకి వచ్చిన రాష్ట్రం మధ్యప్రదేశ్. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఎదురీదుతోంది. ఛత్తీస్‌గఢ్ లో కనుక బీజేపీ మరోసారి ఓడితే ఆ ప్రభావం ఈ రెండు ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది.