10TV Grama Swarajyam : గ్రామాల అభివృద్ధికి ఉద్యమంలా పని చేయాలి.. ఆ రెండు పనులపై ముందుగా దృష్టి పెట్టండి : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

10TV Grama Swarajyam : 10టీవీ గ్రామ స్వరాజ్యం కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

10TV Grama Swarajyam : గ్రామాల అభివృద్ధికి ఉద్యమంలా పని చేయాలి.. ఆ రెండు పనులపై ముందుగా దృష్టి పెట్టండి : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

MLA Jagadish Reddy

Updated On : December 28, 2025 / 1:12 PM IST

10TV Grama Swarajyam : 10టీవీ గ్రామ స్వరాజ్యం.. ‘సర్పంచ్‌ల సమ్మేళనం-2025’ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి ఉద్యమంలా పని చేయాలని సర్పంచ్‌లకు సూచించారు.

Also Read : 10TV Gram Swarajyam : ఆత్మ వంచన మానండి.. మాకు భయం లేదు! : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు పార్టీలకు అతీతంగా పనిచేయాలి. మీపై పోటీ చేసి ఓడిపోయిన వారినిసైతం సాధ్యమైనంత వరకు కలుపుకొనిపోతూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయలేమనే విషయాన్ని నూతన సర్పంచ్ లు గుర్తుంచుకోవాలని జగదీశ్ రెడ్డి సూచించారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడే, అందరినీ కలుపుకొని పోతూ గ్రామాభివృద్ధికి కృషి చేసినప్పుడే ఆ గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందని జగదీశ్ రెడ్డి సూచించారు.

గ్రామాల్లో అభివృద్ధిలో భాగంగా మొట్టమొదటిగా సర్పంచ్‌లు తమ ప్రాధాన్యతను చెట్లు పెంచేందుకు ఇవ్వాలని జగదీశ్ రెడ్డి సూచించారు. ఇండ్లలో, రోడ్ల పక్కన, ఇతర ఖాళీ ప్రదేశాల్లో ఇలా ఎక్కడ వీలుంటే అక్కడ మొక్కలు నాటి చెట్లను అధికంగా పెంచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. కొంతమంది సర్పంచ్ లు కొన్ని ప్రాంతాల్లో చెట్లు వల్ల డ్రైనేజీ పోతుంది.. కరెంట్ కు సమస్య వస్తుందని అంటున్నారు. చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపైకి వస్తే ఆ కొమ్మలను కొట్టేయండి.. కానీ, చెట్లును తొలగించే చర్యలకు పూనుకోవద్దు. డ్రైనైజీనే కాదు.. గోడ కూడా పోనివ్వండి కానీ చెట్టును తొలగించొద్దని జగదీశ్ రెడ్డి సూచించారు. సూర్యాపేటలో ఒకరు చెట్టు కొడితే లక్ష రూపాయలు ఫైన్ వేయించా. నాకు తెలుసు ఆ తరువాత వాళ్ల ఓట్లు నాకు పడవని. ఒక చెట్టు చనిపోవవటం అంటే ఒక మనిషి చనిపోవటం అనే భావనతో చూడాలని జగదీశ్ రెడ్డి నూతన సర్పంచ్ లకు సూచించారు.

గ్రామాల్లోనూ గంజాయి, డ్రగ్స్ కు భానిసలవుతున్న వారు పెరుగుతున్నారు. ఆ మహమ్మారిని కూకటివేళ్లతో తొలగించేందుకు సర్పంచ్ లు ఉద్యమంలా పనిచేయాలని జగదీశ్ రెడ్డి సూచించారు.

భారత దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా అవార్డులు తీసుకున్న పంచాయతీలు ఏవో తెలుసుకోండి.. అక్కడ ఎలా అభివృద్ధి చేశారు.. ఏ ప్రణాళికన అభివృద్ధికి నిధులు కేటాయించారు. అనే విషయాలను తెలుసుకోండి. అవసరమైతే ఆ గ్రామాలకు వెళ్లి విజిట్ చేయండి. అక్కడ ప్రణాళికలతోపాటు మీ సొంత ప్రణాళికతో గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు నూతన సర్పంచ్ లు పాటుపడాలని జగదీశ్ రెడ్డి సూచించారు.