Gold Price: ఒక్కరోజే రూ.2,290 పెరిగిన బంగారం రేటు.. రీజన్ ఏంటంటే?
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నాయి! ఒక్క రోజులోనే పసిడి ధర ఏకంగా రూ.2,290కి పైగా పెరిగి ఇన్వెస్టర్లను, సాధారణ ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది.
ఈ రోజు మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,17,150కి చేరగా, 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర రూ.1,27,800గా నమోదైంది. వెండి ధరలు కూడా భారీగా పెరిగి, కిలో రూ.లక్షా 82వేలకు చేరింది.
రాబోయే ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠ, ఎగ్జిట్ పోల్స్‌లో అంచనాలు తారుమారయ్యే అవకాశం మార్కెట్‌లో అస్థిరతకు దారితీస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్‌లు, అలాగే ఆర్‌బీఐ, తమ గోల్డ్ రిజర్వ్‌లను గణనీయంగా పెంచుకుంటున్నాయి. డాలర్ నిల్వలను తగ్గించుకుంటూ, బంగారం నిల్వలను పెంచడం ఈ ధరల పెరుగుదలకు మరో కీలక కారణం.
పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.
