భారత్ ‘బ్రహ్మాస్త్రం’ ప్రయోగం.. మరోసారి బయటపడిన పాక్ పైత్యం..

పాకిస్తాన్ పరిస్థితి చూస్తే కొన్నిసార్లు జాలి అనిపిస్తుంది, మరికొన్నిసార్లు ఆ దేశపు పాలకులు భారత్‌తో పోటీ పడేందుకు చూపిస్తున్న తాపత్రయం వింతగా అనిపిస్తుంది. తాహతుకు మించి ఆరాటపడటం వల్ల తలెత్తే పరిణామాలు విస్మయం కలిగిస్తాయి. తాజాగా చోటుచేసుకున్న 'నోటమ్' (నోటీస్ టు ఎయిర్‌మెన్) ప్రకటనల వ్యవహారం దీన్ని మరోసారి రుజువు చేసింది. బుధవారం భారత్ విమానాలపై తాము 'నోటమ్' జారీ చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. అయితే, దీనికి ముందురోజే భారత్ కూడా ఓ 'నోటమ్'ను జారీ చేసింది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, భారత్ 'నోటమ్' వెనుక ఒక పటిష్టమైన కారణం ఉంది. కానీ పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం మాత్రం కేవలం భారత్‌ను అనుకరించాలనే ప్రయత్నం తప్ప మరొకటి కాదు.

  • Published By: Mahesh T ,Published On : October 16, 2025 / 01:02 PM IST