మహిళ పొట్టలో 1,538 రాళ్లు

  • Published By: veegamteam ,Published On : February 17, 2019 / 01:17 AM IST
మహిళ పొట్టలో 1,538 రాళ్లు

Updated On : February 17, 2019 / 1:17 AM IST

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలానికి చెందిన పుష్పలత (61) కొన్ని రోజులగా కడుపు నొప్పితో బాధపడుతుంది. నొప్పి భరించలేక ఈ నెల 11న సమిపం లోని శ్రీసచి ఆసుపత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు గాల్ బ్లాడర్ లో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే ఆమెకు ఊపిరితిత్తుల సమస్య ఉండటంతో మొదట ఆ సమస్యకు చికిత్స చేశారు. తర్వాత లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా పిత్తాశయాన్ని తొలగించి ఆందులోని 1538 రాళ్లను వేరు చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారని వైద్యుడు శ్రీనివాస్ శనివారం (ఫిబ్రవరి 16)న వివరించారు.