ఒకటి కన్నా రెండు మాస్క్‌లు సురక్షితమేనా? ఎలాంటి మాస్క్‌లు వాడాలి?

ఒకటి కన్నా రెండు మాస్క్‌లు సురక్షితమేనా? ఎలాంటి మాస్క్‌లు వాడాలి?

Updated On : January 26, 2021 / 12:43 PM IST

Two Masks Really Better Than One : కరోనా మహమ్మారి సమయంలో ప్రతిఒక్కరి జీవితంలో వ్యక్తిగత శుభ్రతతోపాటు సామాజిక దూరం, ముఖానికి మాస్క్ ధరించడం భాగమైపోయింది. బయటకు వెళ్తే చాలు.. ముఖానికి మాస్క్ తో వెళ్లాల్సి వస్తోంది. సాధారణంగా చాలామంది ఒక మాస్క్ పెట్టుకోవడం కామన్. కానీ, కరోనా వంటి వైరస్ ల బారిన పడకుండా ఈ మాస్క్ లు పూర్తిగా రక్షణ ఇవ్వగలవా అంటే కచ్చితంగా అవును అని చెప్పలేం.. కానీ, చాలావరకూ వైరస్ వ్యాప్తిని తగ్గించడంలో సాయపడతాయి.

అందుకే మాస్క్ ధరించాల్సి ఉంటుంది. ఒక మాస్క్ కంటే ఎక్కువగా ధరించడం సురక్షితమేనా? వైరస్ వ్యాప్తిని డబుల్ మాస్క్ అడ్డుకోగలవా? ఎలాంటి మాస్క్‌లు వాడితే బెటర్ అనే సందేహం అందరిలో రావొచ్చు.. క్లాత్ మాస్క్ లు ఒకటే కాదు.. ఎన్నో రకాల మాస్క్ లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇంతకీ అన్ని మాస్క్ లు ఒక్కటేనా? అంటే.. ఏ మాస్క్ కూడా వంద శాతం సురక్షితమేనని చెప్పలేం.. కానీ, N95 మాస్క్ చాలా ఫిట్ గా ఉంటాయి.

మిగతా మాస్క్ లతో పోలిస్తే.. ఇవెంతో బెటర్ కూడా.. అదే వాడిపారేసే సర్జికల్ మాస్క్‌లు కూడా సరైనవే.. అదే క్లాత్ మాస్క్ అయితే రెండు లేదా మూడు లేయర్లు మధ్యలో ఉండేలా చూసుకోవాలి. ఎన్ని లేయర్ల మాస్క్, క్లాత్ మాస్క్ ఎంతవరకు బెటర్ అనేదానిపై మరింత రీసెర్చ్ చేయాల్సి ఉందంటున్నారు. లేయర్లు ఎక్కువగా ఉన్న మాస్క్ వాడితే.. అతిసూక్ష్మ బిందువులు లోపలికి ప్రవేశించికుండా అడ్డుకుంటాయి.

మెడికల్ గ్రేడ్ మాస్క్ కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. ఎక్కువగా నోటి తుంపర్లను అడ్డుకోనేలా మాస్క్ వినియోగం ఉండాలని అంటున్నారు. ఎప్పుడైనా గుర్తించుకోవాల్సింది.. మాస్క్ ఎప్పుడూ ముఖానికి ఫిట్ గా ఉండేలా చూసుకోవాలి. లేదంటే.. మీ శ్వాస పీల్చి వదిలిన గాలి చెంపలు, ముక్కు ద్వారా బయటకు వెళ్లిపోతుంది. అందుకే మాస్క్ కాస్తా ఫిట్ గా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు.