Food Cravings : అర్ధరాత్రి ఆకలితో నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నారా? సమస్య నుండి బయటపడాలంటే!

తగినంత నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత చోటు చేసుకుని ఆకలి కోరికలు కలుగుతాయి. రాత్రిపూట మీకు ఆకలిగా అనిపించటానికి ఇతర విషయాలు కారణమవుతాయి. ఒత్తిడి , విసుగు వంటివి ఇందుకు కారణమౌతాయి.

Food Cravings : అర్ధరాత్రి ఆకలితో నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నారా? సమస్య నుండి బయటపడాలంటే!

eating in the middle of the night

Updated On : September 6, 2022 / 8:53 AM IST

Food Cravings : రోజు మొత్తంగా మూడు పూటలా ఆహారం తీసుకున్నా కొందరిలో మాత్రం వివిధ కారణాల వల్ల అర్ధరాత్రి సమయంలో ఆకలితో నిద్రపట్టక అటుఇటు తిరుగుతుంటారు. ఆ సమయంలో ఆకలిని తీర్చుకునేందుకు ఎదో ఒకటి తినాలని పిస్తుంది. అలాంటి సందర్భంలో అల్పాహారం అవసరం అనిపించవచ్చు. అయితే తగినంత నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత చోటు చేసుకుని ఆకలి కోరికలు కలుగుతాయి. రాత్రిపూట మీకు ఆకలిగా అనిపించటానికి ఇతర విషయాలు కారణమవుతాయి. ఒత్తిడి , విసుగు వంటివి ఇందుకు కారణమౌతాయి. ఉప్పు, తీపి మరియు పిండి పదార్ధాలను తినాలన్న కోరికలు  అర్ధరాత్రి కలుగుతాయి. రాత్రిపూట ఆకలి అనేది బరువు పెరగడానికి దోహదపడే ప్రధాన కారకాల్లో ఒకటి. ఆ సమయంలో చాలా మంది తినడానికి సరికాని ఆహారాన్ని ఎంచుకుంటారు. అర్థరాత్రి ఆకలి కోరికలను తీర్చుకోవడానికి ఆరోగ్య కరమైన ఆహారాలను మాత్రమే ఎంచుకోవాలి. తద్వారా ఆకలి సమస్యలను అదుపులో పెట్టుకోవచ్చు. అర్ధరాత్రి ఆకలి తీర్చటంతోపాటు, బాగా నిద్రపట్టేలా చేసేందుకు కొన్ని పండ్లు తోడ్పడతాయి. వాటి గురించి తెలుసుకుందాం..

1. టార్ట్ చెర్రీస్ ; టార్ట్ చెర్రీస్ రాత్రి సమయంలో ఆకలి లేకుండా బాగా నిద్రపోవడానికి సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఆర్థరైటిస్ మరియు గుండె జబ్బుల నుండి రక్షణ అందిస్తాయి. అల్పాహారం సమయంలో, నిద్రవేళకు 1-2 గంటల ముందు టార్ట్ చెర్రీస్ తో తయారైన డ్రింక్ తాగటం వల్ల ఎక్కువ సమయం నిద్రపోయేందుకు అవకాశం ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. టార్ట్ చెర్రీస్ నిద్రను ప్రోత్సహించే హార్మోన్ మెలటోనిన్‌ను కలిగి ఉంటుంది, చాలా తక్కువ మొత్తంలో మాత్రమే ఉంటుంది. రక్తంలోని అమైనో యాసిడ్ ట్రిప్టోఫాన్‌ను రక్షించడానికి భావించే ఫైటోకెమికల్ ప్రొసైనిడిన్ B-2ని కలిగి ఉంటాయి, దీనిని మెలటోనిన్ తయారు చేయడానికి ఉపయోగించవచ్చు.

2. బాదం వెన్న, అరటి ; ఒక టేబుల్ స్పూన్ (16 గ్రాములు) తియ్యని బాదం వెన్నలో ముంచిన ఒక చిన్న అరటిపండు రుచికరంగా ఉండటంతోపాటు నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది. అర్ధరాత్రి సమయంలో ఆకలి ఉన్నప్పుడు దీనిని తీసుకోవచ్చు. ఆరోగ్యవంతమైన పురుషులు రెండు అరటిపండ్లు తిన్న రెండు గంటలలోపు రక్తంలో మెలటోనిన్ స్థాయిలు 4 రెట్లు ఎక్కువ పెరిగినట్లు అధ్యయనంలో గుర్తించారు. నరాల మెసెంజర్ సెరోటోనిన్‌లో సాపేక్షంగా సమృద్ధిగా ఉన్న కొన్ని పండ్లలో అరటిపండ్లు ఒకటి. బాదం, బాదం వెన్న మెలటోనిన్‌ను కూడా అందిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ E మరియు మెగ్నీషియం యొక్క మంచి మూలం. మెగ్నీషియం మంచి నిద్రకు సహాయపడుతుంది.

3. కివీస్ ; కివీస్ ఎన్నో పోషకాలు కలిగిన పండు అర్ధరాత్రి సమయంలో ఆకలిగా ఉంటే రెండు కివీలు తినటం మంచిది. రెండు ఒలిచిన కివీలు 93 కేలరీలు, 5 గ్రాముల ఫైబర్ మరియు విటమిన్ సి ఉంటాయి. కివీస్ బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. నిద్రలేమితో బాధపడుతున్న 24 మంది పెద్దలలో చేసిన అధ్యయనంలో ప్రతి రాత్రి పడుకునే ఒక గంట ముందు రెండు కివీలు అందించారు. కివీలు తీసుకున్న వారిలో అర్ధరాత్రి ఆకలి లేకుండా నిద్ర మెరుగుపడినట్లు గుర్తించారు.

వీటితోపాటుగా బెర్రీస్‌, నట్స్ , స్కిమ్డ్ పెరుగు, ఉడికించిన గుడ్లు, క్యారెట్లు వంటివన్నీ ఆరోగ్యకరమైన స్నాక్స్‌ కాబట్టి వీటిని ఎంచక్కా తీసుకోవచ్చు. డిన్నర్ చేసిన తర్వాత హాయిగా నిద్ర పోవడానికి వేడి సూప్‌ తాగొచ్చు. తద్వారా మధ్యరాత్రి సమయంలో మెలుకువ రాదు. పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో పసుపు కలిపి తాగినా ఆకలి కోరికలను తగ్గించవచ్చు. అర్ధరాత్రి సమయంలో ఆకలిని నిరోధించాలంటే ఆహారం తీసుకునే సమయాలను ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. అర్ధరాత్రి ఆకలి తీర్చుకునేందుకు జంక్ ఫుడ్ లను తీసుకోవటం మానుకోవాలి. రోజంతా క్రమం తప్పకుండా ఫుడ్ తీసుకోవడంతోపాటు ప్రతి భోజనంలో ప్రోటీన్లు సరిపడా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. రోజువారిగా వ్యాయామాలు చేయటం వంటి వాటి ద్వారా రాత్రి సమయంలో మంచి నిద్రపట్టి అర్ధరాత్రి మెలుకువ వచ్చే పరిస్ధితిని నిరోధించవచ్చు.