నిమిషం పాటు శ్వాసను బిగబట్టి ఉంచితే కరోనా లేనట్లే

ఒక నిమిషం పాటు ఎవరైతే శ్వాసను బిగబట్టి ఉంచగలరో వారికి కరోనా లేనట్లేనని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. "ఆజ్ తక్" ఈ-అజెండా కార్యక్రమంలో రామ్ దేవ్ బాబా మాట్లాడుతూ... కరోనా ల

నిమిషం పాటు శ్వాసను బిగబట్టి ఉంచితే కరోనా లేనట్లే

ఒక నిమిషం పాటు ఎవరైతే శ్వాసను బిగబట్టి ఉంచగలరో వారికి కరోనా లేనట్లేనని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. “ఆజ్ తక్” ఈ-అజెండా కార్యక్రమంలో రామ్ దేవ్ బాబా మాట్లాడుతూ… కరోనా లక్షణాలు ఉన్న కేసులకూ లేని వాటికీ ఈ టెక్నిక్ వర్తిస్తుందని చెప్పారు. అయితే దీర్ఘకాలిక రక్తపోటు, హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటిస్ ఉన్న వారు 30 సెకన్లపాటు గాలిని బిగబట్టి ఉంచితే సరిపోతుందని,అదే యువకులైతే ఒక నిమిషం పాటు శ్వాసను బిగబట్టి ఉంచాలని అన్నారు.

కరోనా కోసం ఓ ప్రత్యేక ప్రాణాయామం ఉందని, దానినే ఉజ్జయి అని పిలుస్తారన్నారు. దీంట్లో భాగంగా గొంతు నుంచి గాలిని సంకోచించి, ఆపై శబ్దంతో దానిని పంప్ చేసి.. కొద్దిసేపు హోల్డ్ చేసి ఉంచి క్రమంగా వదిలేయాలి. ఇది కరోనాకు సెల్ఫ్ టెస్టింగ్ లాంటిదేనని ఆయన అన్నారు. అలా ఉండగలిగితే రోగ లక్షణాలు ఉన్నా లేకపోయినా కరోనా లేనట్లేనని తెలిపారు. కావాలంటే ప్రజలు తమను తాము పరీక్షించుకోవచ్చన్నారు.

అలాగే ముక్కు రంధ్రాల ద్వారా ఆవ నూనెను పోస్తే.. శ్వాసకోశంలో ఏదైనా కరోనా వైరస్ ఉన్నాఅది కడుపులోకి వెళ్లి అక్కడ ఉండే యాసిడ్ ల కారణంగా వైరస్ చనిపోతుందని రాందేవ్ తెలిపారు. ప్రజలందరూ తమ తమ శరీరాల ఇమ్యూనిటీ పెంచుకునేందుకు, అంతర్గత అవయువాలను బలోపేతం చేసుకునేందుకు,కరోనా నుంచి తమను తాము కాపాడుకునేందుకు.. తమ తమ ఇళ్లల్లో ఉండి యోగాను ప్రాక్టీస్ చేయాలని రామ్ దేవ్ చెప్పారు.