Blood pressure in children : పిల్లల్లో రక్తపోటు సమస్య! జీవనశైలిలో మార్పులే కారణమా?

చిన్నారుల్లో అధిక రక్తపోటుకు సంబంధించి కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. సాధారణంగా తలనొప్పి, మూర్ఛ, వాంతులు, ఛాతీ నొప్పి, గుండె వేగవంతంగా కొట్టుకోవటం, శ్వాస ఆడకపోవుటం వంటి సంకేతాలు చిన్నారుల్లో కనిపిస్తాయి.

Blood pressure in children : పిల్లల్లో రక్తపోటు సమస్య! జీవనశైలిలో మార్పులే కారణమా?

Blood pressure problem in children

Updated On : August 26, 2022 / 1:53 PM IST

Blood pressure in children : పిల్లలలో అధిక రక్తపోటు ఇటీవలి కాలంలో అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. సాధారణంగా యుక్తవయస్సు వారి నుండి వృద్ధాప్యంలో ఉన్న వారికి రక్తపోటు సమస్య కనిపిస్తుంది. ప్రస్తుతం జీవనశైలిలో వచ్చిన మార్పులతో చిన్నారుల్లో రక్తపోటు సమస్య ఉత్పన్నం అవుతోంది. సరైన పోషకాహారం తీసుకోక పోవటం, ఊబకాయం, వ్యాయామం చేయకపోవటం వంటి అంశాలు రక్తపోటుకు దారి తీస్తున్నాయి. కొంతమంది చిన్నారుల్లో వారసత్వంగా రక్తపోటు సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి.

చిన్నారుల్లో అధిక రక్తపోటుకు సంబంధించి కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. సాధారణంగా తలనొప్పి, మూర్ఛ, వాంతులు, ఛాతీ నొప్పి, గుండె వేగవంతంగా కొట్టుకోవటం, శ్వాస ఆడకపోవుటం వంటి సంకేతాలు చిన్నారుల్లో కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించటం మంచిది. పిల్లల్లో బీపీ సమస్య ఉందని అనుమానిస్తే మాత్రం తరుచుగా వారి రక్తపోటును పరీక్షించటం మంచిది.

ఉప్పు, చక్కెర అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవటం, ముఖ్యంగా ప్యాక్డ్ ఫుడ్స్ వల్ల పిల్లల్లో బరువు సమస్య వస్తుంది. అచివరకు హైబీపికి దారితీస్తుంది. రక్తపోటు సమస్య రాకుండా చూసుకోవాలంటే తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం విషయంలో ముందు చూపుతో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉప్పుతక్కువగా ఉండే ఆహారాలను అందించాలి.

తాజా, కూరగాయలు, పండ్లు, పీచు కూడిన పదార్ధాలను అందించాలి. జీవనశైలి మార్పులు పిల్లలలో అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. పిల్లల్లు చదువులు, సెల్ ఫోన్లకే పరిమితం కాకుండా రోజుకు కొంత సమయంలో ఆటలకు కేటాయించేలా చూడాలి. బరువు పెరగకుండా చూడాలి.