Stress Cause Diabetes : ఒత్తిడి మధుమేహానికి కారణమవుతుందా?

17వ శతాబ్దం నుండి మధుమేహం, ఒత్తిడి మధ్య సంబంధాన్ని పరిశోధకులు ప్రస్తావిస్తూనే ఉన్నారు. డిప్రెషన్ , ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తులు టైప్ 2 డయాబెటిస్‌ను గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి.

Stress Cause Diabetes : ఒత్తిడి మధుమేహానికి కారణమవుతుందా?

diabetes

Stress Cause Diabetes : ఒత్తిడి ఒక్కటే మధుమేహానికి కారణం కాదు. ఒత్తిడి,టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం మధ్య సంబంధం ఉండవచ్చని కొన్ని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. అధిక స్థాయి ఒత్తిడి హార్మోన్లు ప్యాంక్రియాస్‌లోని ఇన్సులిన్-ఉత్పత్తి చేసే కణాలను సరిగ్గా పనిచేయకుండా నిలిపివేస్తాయి. దీంతో అవి తయారుచేసే ఇన్సులిన్ మొత్తం తగ్గుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. క్రమంగా, ఇది టైప్ 2 డయాబెటిస్ రావటానికి దోహదం చేస్తుంది. కార్టిసాల్‌ను ఎక్కువగా విడుదల చేసే వ్యక్తులకు టైప్ 2 ప్రమాదం ఎక్కువగా ఉంటుందా లేదా అనే విషయంపై పరిశోధనలు కొనసాగుతున్నాయి.

READ ALSO : Heart Health : రోజుకు 11 నిమిషాలు నడిస్తే చాలు.. గుండె ఆరోగ్యం భేష్

ఒత్తిడికి గురైనప్పుడు అతిగా తినడం టైప్ 2 డయాబెటిస్‌ రావటానికి ఒక కారణం కావచ్చు. కొంతమంది ఒత్తిడి సమయంలో తమకు తెలియకుండానే నియంత్రణను కోల్పోయి ఎక్కువ తింటారు. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. ప్రతి వ్యక్తి ఏదొక సందర్భంలో ఒత్తిడికి గురవుతాడు, ఇది మానవ ప్రతిచర్య. మానవ శరీరం ఒత్తిడిని గ్రహించి దానికి ప్రతిస్పందించేలా రూపొందించబడింది. ఒత్తిడి ప్రతిస్పందనలు మన శరీరం అన్ని పరిస్థితులకు అలవాటు పడటానికి సహాయపడతాయి. ఒత్తిడి మనల్ని అప్రమత్తంగా, ప్రేరణగా మరియు ప్రమాదాన్ని నివారించడానికి సిద్ధంగా ఉంచుతుంది.

అదే సమయంలో దీర్ఘకాలిక ఒత్తిడి పరిణామాలు శరీరానికి హానికరం కలిగిస్తుంది. ఒత్తిడి, నిశ్చల జీవితం, అనారోగ్యకరమైన ఆహార విధానాలతో ముడిపడిన జీవనశైలి వల్ల బరువు పెరగడం , గ్లూకోజ్, లిపిడ్ క్యాటాబోలిజంతో సంబంధం ఉన్న అసాధారణత పరిస్ధితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

READ ALSO : Hair Health : వర్షకాలంలో జుట్టు ఆరోగ్యం కోసం పెరుగుతో ఇలా చేసి చూడండి !

శరీరం యొక్క జీవక్రియపై గ్లూకోకార్టికాయిడ్ల ప్రభావాలు ;

గ్లూకోకార్టికాయిడ్లు గ్లూకోనోజెనిసిస్‌ను ప్రేరేపించడం ద్వారా పని చేస్తాయి. గ్లైకోజెన్ క్షీణతకు కారణమవుతాయి. కండరాలు , తెల్ల కొవ్వు కణజాలం గ్లూకోజ్‌ను గ్రహించకుండా , ఉపయోగించకుండా నిరోధిస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడి క్రమంగా ఇన్సులిన్ నిరోధకత , చెడు కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది. గ్లూకోకార్టికాయిడ్లు ఇన్సులిన్ జీవక్రియ చర్యలను వ్యతిరేకిస్తాయి. ఫలితంగా కండరాలు గ్లూకోజ్‌ని గ్రహించే సామర్థ్యం తగ్గుతుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి.

READ ALSO :  Ignoring Social Media : రోజులో కేవలం 15 నిమిషాలు సోషల్ మీడియాను దూరంపెడితే మీ ఆరోగ్యం మెరుగుపడటం ఖాయం !

17వ శతాబ్దం నుండి మధుమేహం, ఒత్తిడి మధ్య సంబంధాన్ని పరిశోధకులు ప్రస్తావిస్తూనే ఉన్నారు. డిప్రెషన్ , ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తులు టైప్ 2 డయాబెటిస్‌ను గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి. నిరాశ, ఆందోళన, ఒత్తిడి పరిస్థితుల కలయికతో బాధపడుతున్న వ్యక్తులు మధుమేహం బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకలు తేల్చారు. వివిధ రకాల ఒత్తిళ్లు మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు, వాటిలో ఒత్తిడితో కూడిన జీవిత సంఘటనలు, బాధాకరమైన విషయాలు, భావోద్వేగ ఒత్తిడి, కోపం, శత్రుత్వం, పని ఒత్తిడి, సరిగా నిద్రలేకపోవటం వంటివి కారణమని చెబుతున్నారు.

READ ALSO : Sapota Fruits : వేసవి కాలంలో రోజుకు రెండు సపోటా పండ్లు తింటే చాలు…మంచి ఆరోగ్యం మీ సొంతం!

ఒత్తిడి హార్మోన్లను ప్రభావితం చేస్తుంది ;

భావోద్వేగ పూరితమైన ఒత్తిడి హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ఇన్సులిన్ పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. అధిక కార్టిసాల్ స్థాయిలు, హార్మోన్ల మార్పులకు కారణమవుతాయి. ఈ హార్మోన్ల స్థాయిలు ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. కార్టిసాల్‌ను సాధారణంగా ఒత్తిడి హార్మోన్ అని పిలుస్తారు. ఇది శరీరంలో గ్లూకోజ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. రక్తంలో చక్కెరను పెంచుతుంది. మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులకు ఇది ముఖ్యమైన ప్రమాద కారకంగా నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడితో కూడిన సంఘటనలు రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణమవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి రోజువారిగా రక్తంలో గ్లూకోజ్‌ స్ధాయిలను పరిశీలించాలి. తద్వారా వాటిని విశ్లేషించటం ద్వారా ఒత్తిడి రక్తంలో చక్కెరను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవచ్చు.