Vitamin B12 Deficiency: ఎవరినైనా ముట్టుకున్నప్పుడు షాక్ కొడుతుందా.. అయితే ఈ లోపం ఉన్నట్టే

ఒకమనిషి మరో మనిషిని తాకినప్పుడు షాక్ కొట్టడం అనేది ఒక విటమిన్ లోపం వల్ల జరుగుతుందట. అదే విటమిన్ బీ12. ఈ విటమిన్ స్థాయిలో శరీరంలో తక్కువ అయినప్పుడు ఇలా షాక్ కొట్టినట్టుగా అనిపిస్తుంది.

Vitamin B12 Deficiency: ఎవరినైనా ముట్టుకున్నప్పుడు షాక్ కొడుతుందా.. అయితే ఈ లోపం ఉన్నట్టే

vitamin b12 deficiency

Updated On : June 5, 2025 / 11:09 AM IST

మగధీర సినిమాలో హీరో రామ్ చరణ్ హీరోయిన్ కాజల్ ను ముట్టుకోగానే షాక్ కొట్టినట్టు అవుతుంది కదా. అలా బయట కూడా చాలా సందర్భాల్లో ఎవరినైనా ముట్టుకున్నప్పుడు చిన్నగా షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. అదేంటి కరంట్ లేకుండా కూడా అలా షాక్ కొడుతుందా? ఎందుకు అలా జరిగింది అనే సందేహం చాలా మందిలో కలిగే ఉంటుంది. ఏదైనా ఆరోగ్య సమస్యనా అని ఆలోచించే వారు కూడా ఉంటారు. మరి అలా జరగడానికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిజానికి ఒకమనిషి మరో మనిషిని తాకినప్పుడు షాక్ కొట్టడం అనేది ఒక విటమిన్ లోపం వల్ల జరుగుతుందట. అదే విటమిన్ బీ12. ఈ విటమిన్ స్థాయిలో శరీరంలో తక్కువ అయినప్పుడు ఇలా షాక్ కొట్టినట్టుగా అనిపిస్తుంది. మానవ శరీరంలో విటమిన్ బీ12 అనేది ప్రధానమైనది. ఇది డీఎన్ఏ నిర్మాణంలో, ఎర్రరక్త కణాల తయారీలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. నరాల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మెదడు పనితీరు కోసం కూడా విటమిన్ బీ12 పని చేస్తుంది.

నరాలు మెదడు నుండి శరీర భాగాలు సంకేతాలను అందజేస్తాయి. కానీ, శరీరంలో విటమిన్ బీ12 లోపం వల్ల నరాలు బలహీనంగా మారుతాయి. దానివల్ల నరాలు శరీరభాగాలు సంకేతాలను పంపడంలో జాపం ఏర్పడుతుంది. కొన్నిసార్లు తప్పుగా కూడా పంపే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలోనే ఇలా ఒక మనిషి మరో మనిషిని తాకినప్పుడు షాక్ కొట్టినట్టుగా అనిపిస్తుంది. విటమిన్ బీ12 లోపం అనేది తల వెనుక భాగం, వెన్నుముక భాగాల్లో గాయాలు అవడం వల్ల వచ్చే అవకాశం ఉంది.

డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఇలా షాక్ లు రావొచ్చు. ఎందుకంటే ఈ సమస్య ఉన్నవారికి నరాల బలహీనత సమస్య కూడా ఉంటుంది. విటమిన్ బీ12 లోపానికి నరాల బకహీనత ప్రధాన కారణంగా చెప్పుకొచ్చు. కాబట్టి.. ఈ సమస్య ఉన్నవారు విటమిన్ బీ12 లోపాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఆహారం పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ లోపాన్ని తగ్గించుకోవచ్చు. కొద్దిపాటి వ్యాయాయం, యోగా లాంటివి చేస్తే విటమిన్ బీ12 లోపం నుండి బయటపడవచ్చు.