హమ్మయ్య ఇది షుగర్ ఫ్రీ.. ఏం కాదులే అనుకుంటున్నారా..? వాటిలో ఏం వాడతారు? ఏం సమస్యలు వస్తాయంటే..
Sugar-Free Products: కృత్రిమ తీపి పదార్థాలలో ముఖ్యంగా సోర్భిటోల్ (Sorbitol), ఎరిత్రిటోల్ (Erythritol), మాల్టిటోల్ (Maltitol) వంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తారు.

Consuming too much sugar-free products is harmful to health
ప్రస్తుతం జనరేషన్ లో మధుమేహంతో బాధపడుతున్నవారు సంఖ్య రోజురోజుకి చాలా పెరుగుతోంది. ఈ సమస్య ఉన్నవారు తీపి పదార్థాలు దూరంగా ఉండాలి. అయితే, ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన కారణంగా షుగర్ ఫ్రీ పదజాలం ప్రాచుర్యం పొందింది. డయాబెటిస్, బరువు నియంత్రణ, కాలరీ తగ్గింపు కోసం చాలామంది షుగర్ ఫ్రీ ఉత్పత్తులను వాడుతున్నారు. వీటిలో చక్కెర కాకుండా కృత్రిమ తీపిపదార్థాలు, లో-క్యాలరీ స్వీట్‌నర్స్ ఉంటాయి. కాబట్టి, ఇలాంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు కలగవచ్చని పరిశోధనలు చెప్తున్నాయి. మరి షుగర్ ఫ్రీ ఐటమ్స్ తీసుకోవడం వల్ల కలిగే ఆ ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1.జీర్ణ సంబంధిత సమస్యలు:
కృత్రిమ తీపి పదార్థాలలో ముఖ్యంగా సోర్భిటోల్ (Sorbitol), ఎరిత్రిటోల్ (Erythritol), మాల్టిటోల్ (Maltitol) వంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి షుగర్ ఆల్కహాల్స్ కిందకి వస్తాయి. ఇవి పూర్తి స్థాయిలో జీర్ణం కాకపోవడం వల్ల అజీర్తి, ఉబ్బరం, వికారం, లూస్ మోషన్ వంటి సమస్యలు కలగవచ్చు.
2.మధుమేహంపై ప్రతికూల ప్రభావం:
మధుమేహం ఉన్నవారికలో కొన్ని కృత్రిమ స్వీట్‌నర్స్ శరీరంలో ఇన్సులిన్ రెస్పాన్స్ను ప్రభావితం చేసే అవకాశం ఉందట. ముఖ్యంగా సక్రాలోస్, ఆస్పార్టేమ్. ఇవి చక్కెరలా గ్లూకోజ్‌ను నేరుగా పెంచకపోయినా, దీర్ఘకాలంగా తీసుకుంటే ఇన్సులిన్ సమతుల్యతను ప్రభావితం చేయవచ్చునని కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
3.మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదం:
ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్స్ ఉపయోగించే వ్యక్తుల్లో మెటబాలిక్ సిండ్రోమ్ అభివృద్ధి చెందే అవకాశముందని కొంతమంది పరిశోధకులు అంటున్నారు. ఇది అధిక బరువు పెరగడానికి కారణం అవుతుంది.
4.మానసిక ఆరోగ్యం మీద ప్రభావం:
ఆర్టిఫీషియల్ స్వీట్ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆస్పార్టేమ్ వాడకం వల్ల కొంతమందిలో తలనొప్పి, మూడ్ స్వింగ్‌లు, మైగ్రేన్ లాంటి తీవ్రమైన సమస్యలు ఏర్పడే ఆవకాశం ఉంది.
5.గుండె సంబంధిత సమస్యలు:
కొంతమంది పరిశోధకుల పరిశోధనల ప్రకారం నిరంతరంగా షుగర్ ఫ్రీ డ్రింకులు లేదా పదార్థాలను తీసుకుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చునని చెబుతున్నారు. ముఖ్యంగా కృత్రిమ స్వీట్‌నర్స్ ఉన్న సోడాలు/డైట్ డ్రింకులు తాగడం అనేది దీనికి ప్రధాన కారణంగా చెప్పబడుతున్నారు.
షుగర్ ఫ్రీ పదార్థాలు కొంతవరకు ఉపయోగకరమైనవే. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి, తక్కువ క్యాలరీల డైట్ పాటించేవారికి. కానీ, దీర్ఘకాలికంగా వాడటం అనేది ప్రమాదానికి సంకేతం అని నిపుణులు చెప్తున్నారు. ఒక ఆరోగ్య నిపుణుని సంప్రదించి మంచి తీపి ప్రత్యామ్నాయాలను ఎంపిక చేసుకోవడం ఉత్తమం.