భారత్‌లో పంజా విసురుతున్న కరోనా.. పాజిటివ్ కేసులు 28,380, మృతులు 886

భారత్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. నిన్న కొత్తగా 1436 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 28, 380 కు చేరుకున్నాయి. ఇప్పటివరకు దేశంలో 886 మంది మరణించారు. కరోనాతో పోరాడి కోలుకొని 6362 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో 21, 132 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మన దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం ప్రస్తుతం 22.17గా ఉంది. 16 జిల్లాలో 28 రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు కూడా కొత్తగా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 85 జిల్లాల్లో గత 14 రోజులుగా కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదు.
మహారాష్ట్ర రోజురోజుకూ కరోనా ఊబీలో కూరుకుపోతోంది. కరోనా నుంచి తేరుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో ప్రతి రోజు వందలాది కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న ఒక్క రోజే 522 కొత్త కేసులు నమోదు కాగా, 27 మంది మరణించారు. 94 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటివరకు 8590 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 369 మరణించారు. 1282 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబాయిలో కరోనా స్వైరవిహారం చేస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతోపాటు మరణాలు ఆగకపోవడం కలవరపాటుకు గురిచేస్తోంది. మహమ్మారి బారిన పడి మూడు రోజుల్లో ముగ్గురు పోలీసులు మరణించడం ఆందోళన కలగిస్తోంది. ముంబాయిలో మొత్తం కేసులు 5407 చేరుకోగా, మురికివాడ ధారావిలో కొత్తగా 13 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంకఖయం 288 కు చేరింది.
ఉత్తరప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేలకు చేరువైంది. అక్కడ కొత్తగా 113 మందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1986 కు చేరింది. అయితే యూపీలో నమోదైన కేసుల్లో అత్యధింగా ఆగ్రాలోనే రికార్డు అయ్యాయి. ఇక్కడ ఒక్కచోటే 9384 కేసులు నమోదు అవ్వగా, కాన్పూర్ లో 197, లక్నోలో 196 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 31 గా ఉంది.
కర్నాటకలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చాపకింద నీరులా నిదానంగా పెరుగోతంద. కొతగా 9 కేసులు నమోదు అయ్యాయి. దీంత ఆ రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా పాజిటిట్ కేసుల సంఖ్య 512 కు చేరింది. మొత్తం కేసుల్లో 193 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 20 మంది మరణించారు. ప్రస్తుతం 299 యాక్టివ్ కేసులు ఉండగా, వారంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తమిళనాడులో కోవిడ్-19 కేసులు 2వేలకు చేరువయ్యాయి. నిన్న కొత్తగా మరో 50 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1937కి చేరింది. ప్రస్తుతం 812 మంది వివిధ ఆస్పత్తుల్లో చికిత్స పొందుతున్నారు. 1101 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిరవకు రాష్ట్రంలో 24 మంది మరణించారు. రాష్ట్రంలో అత్యధికంగా చెన్నైలోనే 500 మందికిపైగా కరోనా బారిన పడ్డారు.
మరోవైపు కరోనా ప్రభావిత ప్రాంతాలను కేంద్ర బృందం పరిశీలించింది. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ముందు జాగ్రత్తలపై ఆరా తీసింది. మరోవైపు ఈశాన్య ప్రాంతాల్లోని 8 రాష్ట్రాలకు గానూ 5 రాష్ట్రాలు కరోనా వైరస్ నుంచి పూర్తిగా విముక్తి పొందాయని కేంద్రం ప్రకటించింది. కరోనా విముక్త రాష్ట్రాల్లో సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర ఉన్నాయి.
అస్సాం, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాల్లోనూ ఇటీవల కొత్త కేసులు నమోదు కాకుండా ఇంకా అవి కరోనా నుంచి పూర్తిగా విముక్తి పొందలేదని ప్రకటించింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఈశాన్య రాష్ట్రాలన్నీ కేంద్రంతో కలిసి చర్యలు చేపడతున్నాయని, షిల్లాంగ్ ప్రధాన కార్యాలయంగా ఉన్న ఈశాన్య అభివృద్ధి మండలి అద్బుతమైన సమన్వయంతో పని చేస్తుందని కేంద్రం ప్రశంసించింది.