కరోనా నుంచి కోలుకున్నవారిలో మానసిక సమస్యలు.. మెదడు 10ఏళ్ల పిల్లాడిలా మారుతుందంట!

  • Published By: sreehari ,Published On : October 28, 2020 / 05:27 PM IST
కరోనా నుంచి కోలుకున్నవారిలో మానసిక సమస్యలు.. మెదడు 10ఏళ్ల పిల్లాడిలా మారుతుందంట!

Updated On : October 28, 2020 / 5:49 PM IST

Covid patients brains may age 10 years : కరోనా వైరస్ నుంచి కోలుకున్న కొంతమందిలో మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతోందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. కొన్ని తీవ్రమైన కరోనా కేసుల్లో చాలామందిలో మానసిక సమస్యలకు దారితీస్తోందని అంటున్నారు.



అంతేకాదు.. వారి మెదడు వయస్సు కూడా 10ఏళ్ల పిల్లాడి మనస్తత్వానికి మారిపోతుందని హెచ్చరిస్తున్నారు. లండన్ ఇంపెరియల్ కాలేజీలో డాక్టర్ Adam Hampshire నేతృత్వంలోని వైద్యుల బృందం 84వేల మందికి పైగా అధ్యయనం చేసింది.

వీరిలో కరోనా తీవ్రమైన కేసుల్లో కొన్ని నెలల పాటు మానసికపరమైన సమస్యలకు దారితీసిందని పరిశోధకులు గుర్తించారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కూడా వారిలో దీర్ఘకాలికంగా మానసిక సమస్యలకు కారణమవుతోందని పరిశోధనలో విశ్లేషించారు.



వీరిలో మెదడు పనితీరు ఎలా ఉంది? వారిలో ఏమైనా మతిమరపు లక్షణాలు ఉన్నాయా? అని కొన్ని పరీక్షలు నిర్వహించారు. పదాలను గుర్తుపట్టడం లేదా పజిల్ పూర్తి చేయమనడం వంటి అనేక పరీక్షలు చేశారు. వారిలో మెదడు తాత్కాలికంగా బలహీనపడినట్టు పరిశోధకులు గుర్తించారు.



అధ్యయనంలో భాగంగా 84,285 మందిపై Great British Intelligence Testతో పరీక్షించింది. కరోనాతో ఆస్పత్రిలో చేరి కోలుకున్నవారిలో సగటున 20ఏళ్ల వయస్సు నుంచి 70ఏళ్ల వయస్సు మధ్య వారి మెదడు వయస్సు 10ఏళ్ల వయస్సుకు సమానమని గుర్తించారు.