ఇదో వింత వ్యాధి: ఈ బాలుడు నిద్రపోతే చనిపోతాడు

ప్రతి జీవికి నిద్ర ఎంతో అవసరం. సరైన నిద్ర లేకుంటే మనిషే కాదు.. ఏ ప్రాణి ఆరోగ్యంగా జీవించలేదు. కానీ, నిద్రపోతే మనిషి చనిపోతారనడం ఎప్పుడైనా, ఎక్కడైనా విన్నారా? విని ఉండరు.

  • Published By: sreehari ,Published On : January 25, 2019 / 11:07 AM IST
ఇదో వింత వ్యాధి: ఈ బాలుడు నిద్రపోతే చనిపోతాడు

Updated On : January 25, 2019 / 11:07 AM IST

ప్రతి జీవికి నిద్ర ఎంతో అవసరం. సరైన నిద్ర లేకుంటే మనిషే కాదు.. ఏ ప్రాణి ఆరోగ్యంగా జీవించలేదు. కానీ, నిద్రపోతే మనిషి చనిపోతారనడం ఎప్పుడైనా, ఎక్కడైనా విన్నారా? విని ఉండరు.

ప్రతి జీవికి నిద్ర ఎంతో అవసరం. సరైన నిద్ర లేకుంటే మనిషే కాదు.. ఏ ప్రాణి ఆరోగ్యంగా జీవించలేదు. కానీ, నిద్రపోతే మనిషి చనిపోతారనడం ఎప్పుడైనా, ఎక్కడైనా విన్నారా? విని ఉండరు. నిద్రపోతే చనిపోవడమేంటీ  అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. ఇప్పుడు అదే నిద్ర ముక్కుపచ్చలారని 6 నెలల పసిబాలుడి పాలిట శాపంగా మారింది. బాల్యంలోనే మృత్యువు కబళించేందుకు మాటు వేసింది. ఎప్పుడు నిద్రపోతాడా? అని కాచుకోని చూస్తోంది. నిద్రపోయాడా? అంతే.. బాలుడు ప్రాణాలకే ముప్పుని డాక్టర్లు తేల్చేశారు. ఇంతకీ ఈ బాలుడికి వచ్చిన వింత వ్యాధి ఏంటో తెలుసా? సెంట్రల్ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్ (సీహెచ్ఎస్). అత్యంత అరుదుగా వచ్చే వ్యాధిగా తేల్చిన వైద్యులు.. బాలుడు నిద్రపోతే ప్రాణాలకు ముప్పు వాటిల్లుంతుందని చెబుతున్నారు. 

వెయ్యి మందిలో ఒకరికి.. అరుదైన వ్యాధి
ఢిల్లీకి చెందిన ప్రవీణ్ దత్త్ అనే వ్యక్తి భార్య మీనాక్షి 2018 జూలై 25న మగబిడ్డకు జన్మనిచ్చింది. లేకలేక పుట్టిన బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. బాలుడికి యథార్ధ్ అని నామకరణం చేశారు. కానీ, బిడ్డ పుట్టాడనే సంతోషం ఎంతోకాలం ఉండలేదు. ఇంతలోనే దేవుడుకి కన్ను కుట్టినట్టుంది. అందుకే ఎవరికీ రానీ అంతుపట్టని రోగాన్ని పసిబాలుడికి ఇచ్చాడు. పుట్టిన రెండు వారాలకే బాబు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డాడు. ఒక్కసారిగా శరీరమంతా బ్లూ కలర్ లోకి మారిపోవడం మొదలైంది. వెంటనే ఆ తల్లి అతడికి నోటి ద్వారా గాలి అందించింది. ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయించడంతో ఈ (సీహెచ్ఎస్) వింత వ్యాధి ఉందని వైద్యులు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి మంది నుంచి 1,200 మందిలో ఒకరికి ఈ వ్యాధి అరుదుగా వస్తుందని వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొత్తిళ్లలో ఆడుకుంటున్న పసిబాలుడికి ఈ మాయరోగం భగవంతుడు ఎందుకు ఇచ్చాడా? అని బోరుమని విలపించడం అందరిని కలిచివేస్తోంది. బాలుడు నిద్రపోతే చనిపోతాడని వైద్యులు చెప్పడంతో.. అప్పటినుంచి ఆ తల్లి తన బిడ్డను అసలు నిద్రపోకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది.

ఇక్కడ మందు లేదు.. ఆపరేషన్ కు  రూ.38 లక్షలు
ఈ వ్యాధికి చికిత్స లేదా? అంటే ఉందని వైద్యులు చెబుతున్నారు. కానీ, ఆపరేషన్ చేసే డివైజ్ భారత్ లో లేదట. యూఎస్ నుంచి ఎక్స్ పోర్ట్ చేయాల్సి ఉంది. బాలుడి ఆపరేషన్ కు రూ.38 లక్షల వరకు ఖర్చు అవుతుంది. బిడ్డ ఆపరేషన్ కు అయ్యే ఖర్చును భరించే ఆర్థిక స్థోమత తల్లిదండ్రులకు లేదు. తమ పిల్లాడి ప్రాణాలు కాపాడాలని సోషల్ మీడియా వేదికగా వేడుకుంటున్నారు. తమ పిల్లాడికి వైద్య సాయం అందించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, క్రికెటర్లు యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్ ల ట్విట్టర్ అకౌంట్లకు రెగ్యులర్ గా ట్వీట్ చేస్తున్నారు. ఏదైనా మిరాకిల్ జరిగి యథార్థ్ ప్రాణాలతో బయటపడాతడని ప్రవీణ్ దంపతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.