Dengue: డెంగ్యూ డేంజర్.. వర్షాకాలం వచ్చేసింది.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

డెంగ్యూ అనేది దోమల ద్వారా సంక్రమించే ఒక అంటువ్యాధి. ఆడ ఈడిస్ ఈజిప్టి , ఈడిస్ ఆల్బోపిక్టస్ అనే దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

Dengue: డెంగ్యూ డేంజర్.. వర్షాకాలం వచ్చేసింది.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Dengue symptoms

Updated On : June 13, 2025 / 6:59 AM IST

వర్షాకాలం వచ్చింది అంటే చాలు దోమల బెడద స్టార్ట్ అవుతుంది. అలాగే డెంగ్యూ, మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధులు కూడా మొదలవుతాయి. డాక్టర్స్, నిపుణులు కూడా డెంగ్యూ పట్ల అస్సలు నిర్లక్షయం చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ముందు నుండే జాగ్రత్తలు తీసుకూలికోవడం మంచిది అంటున్నారు. నిజానికి డెంగ్యూ వల్ల ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. అందికే.. ఇప్పుడు వర్షాకాలం మొదలయ్యింది కాబట్టి డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధుల పట్ల జాగ్రత్తలు వహించాలని చెప్తున్నారు. మరి జాగ్రత్తలు ఏంటి? డెంగ్యూ లక్షణాలు ఎలా గుర్తించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఎలా వ్యాప్తి చెందుతుంది, లక్షణాలు ఏంటి?

డెంగ్యూ అనేది దోమల ద్వారా సంక్రమించే ఒక అంటువ్యాధి. ఆడ ఈడిస్ ఈజిప్టి , ఈడిస్ ఆల్బోపిక్టస్ అనే దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలు కొన్నిసాలు జికా వైరస్ , చికెన్‌పాక్స్‌ను వైరస్ ను కూడా వ్యాప్తి చెందిస్తాయి. ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. కాబట్టి, మనం నివసించే ప్రదేశాలు ఎప్పుడు దోమలు వ్యాప్తి చెందకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. డెంగ్యూ వ్యాధి లక్షణాల్లో ప్రధానమైనది జ్వరం, తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. చర్మంపై దద్దుర్లు, కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని చెప్తున్నారు డాక్టర్స్.

చికిత్స, నివారణ చర్యలు:

డెంగ్యూ వ్యాధి నివారణకు వ్యాక్సిన్ లేదు. కేవలం జ్వరం యొక్క లక్షణాలను బట్టి మాత్రమే ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అందుకే ఇది ప్రాణాంతకంగా మారింది. కాబట్టి, డెంగ్యూ వ్యాధికి చికిత్స కంటే నివారణ చాలా ప్రధానం. కాబట్టి, వర్షాకాలం వచ్చింది అంటే డెంగ్యూ లాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిది. ముందుగా మన ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లోకి దోమలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బకెట్లు , డ్రమ్ములలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. లేదండి అవి దోమల వ్యాప్తికి కారణం అవ్వొచ్చు. రాత్రి పడుకునేటప్పుడు దోమతెరలు వాడటం మంచిది. సాయంత్రం అవగానే కిటికీలు, తలుపులు మూసివేయండం మంచిది. ముఖ్యంగా పిల్లల పట్ల జాగ్రత్త మంచిది. ఇలాంటి చిన్న చిన్న నివారణ చర్యలు చేపట్టడం వల్ల డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందకుండా చూసుకోవచ్చు.