Diabetes prevention: బెండకాయతో మధుమేహానికి చెక్.. షుగర్ లెవల్స్ తగ్గిస్తుందా..?

Lady Finger (1)
Diabetes prevention: బెండకాయలను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటుంటారు.. మనం వింటూనే ఉన్నాం.. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో బెండకాయలు ఎంతగానో సహాయపడుతున్నట్లుగా న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. మీరు డయాబెటిక్ పేషంట్ అయితే, షుగర్ లెవెల్స్ తగ్గించడంతో బెండకాయలు బాగా పనిచేస్తాయి. న్యూట్రిషనిస్టుల ప్రకారం డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు బెండకాయల వినియోగం చాలామంచిది అని చెబుతున్నారు నిపుణులు.
సాంబారు, పచ్చడి, ఫ్రై, పులుసు.. ఎలా వాడుకున్నా కూడా బెండకాయ షుగర్ వ్యాధి గ్రస్తులకు చాలా మంచిది. బెండకాయలను విరివిగా ఉపయోగించడం వల్ల అందులోని పోషక ప్రయోజనాల దృష్ట్యా, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. బెండకాయల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీవ క్రియల పరంగా కూడా అనేకరకాల ప్రయోజనాలను అందిస్తాయి బెండకాయలు. సహజ సిద్దంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు బెండకాయలు సహాయపడుతాయి.
బెండకాయల్లో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది మంచి మెడిసిన్‌గా కూడా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇందులో ప్రధానంగా ఎ, బి1(థయామిన్), బి2(రిబోఫ్లోవిన్), బి3(నియాసిన్), బి9(ఫోలైట్), సీ, ఈ, కే విటమిన్లు ఉండగా.. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటి మినరల్స్‌తో పాటు డైటరీ ఫైబర్ కూడా షుగర్ వ్యాధిగ్రస్తులకు బాగా సాయం చేస్తుంది. ఒక సాధారణ బెండకాయలో 90శాతం నీటితో, 7శాతం కార్బోహైడ్రేట్లతో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
బెండకాయలను షుగర్ వ్యాధిగ్రస్తులు రోజూ తీసుకున్నా కూడా ఏమాత్రం ఇబ్బంది లేదు అని నిపుణులు చెబుతున్నారు. బెండకాయలు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో డైటరీ ఫైబర్ గొప్ప వనరుగా ఉపయోగపడుతుంది. తక్కువ కేలరీలతో, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్(GI) కలిగి సూపర్ ఫుడ్‌గా పరిగణించబడుతుంది. కరగని డైటరీ ఫైబర్ నెమ్మదిగా గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. జీర్ణ క్రియలకు సహాయపడేలా ప్రేగు మార్గాన్ని సులభతరం చేయడంలో బెండకాయలు సహాయం చేస్తాయి.
మలబద్దకం వంటి సమస్యలతో పోరాడడంలోనే కాకుండా, అజీర్ణం సమస్యలు కొన్ని పరిశోధనల ప్రకారం, గర్భధారణ సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి బెండకాయలు ఎంతగానో సహాయం చేస్తాయి. గర్భస్థ మధుమేహం కూడా రాకుండా ఆపడంలో బెండకాయలు పనిచేస్తున్నాయి. వాస్తవానికి పదిలో ఇద్దరు, ఈ గర్భస్థ మధుమేహం సమస్యను ఎదుర్కొంటున్నారు.