Side Effects Of Tea: టీ తాగుతూ ఇవి తింటున్నారా.. మీరు ప్రమాదంలో ఉన్నట్టే.. ఈ జాగ్రత్తలు పాటించండి
టీ తాగుతూ ఆకుకూరలు, బీన్స్, క్యాబేజీ వంటి పదార్థాలు అస్సలు తినకూడదట. ఎందుకంటే వీటిలో ఇనుము అధికంగా ఉంటుంది.

Tea side effects
టీ.. ఇది మానవ జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. సందర్భం ఏదైనా మైండ్ రిలీఫ్ అవ్వాలంటే వేడి టీ పడాల్సిందే. అంతలా టీ అంటే ఇష్టపడతారు చాలా మంది. కొంత మంది టీని టీ లాగ తాగడానికే ఇష్టపడతారు. కొంతమంది మాత్రం దాంట్లో బిస్కెట్స్, రస్క్ లాంటి పదార్థాలు కలుపుకొని తింటారు. వాటితో ఎలాంటి సమస్య లేదు. కానీ, అధ్యాయనాల ప్రకారం టీ తాగుతూ కొన్ని ఆహార ప్రదార్థాలను అస్సలు తినకూడదట. అవి విషంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. మరి ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందా.
టీ తాగుతూ ఆకుకూరలు, బీన్స్, క్యాబేజీ వంటి పదార్థాలు అస్సలు తినకూడదట. ఎందుకంటే వీటిలో ఇనుము అధికంగా ఉంటుంది. టీలో ఉండే టానిన్ అనే రసాయనాలు శరీరంలో ఇనుము శోషణను అడ్డుకునే ప్రమాదం ఉంది. దీనివల్ల రక్తహీనత వచ్చే అవకాశం ఉంది.
ఇడ్లీ, దోసె, రొట్టె, వంటి పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కాబట్టి వీటిని తినే సమస్యల్లో టీ తాగితే టీలో ఉండే కెఫిన్ ఇన్సులిన్ పనితీరును ప్రభావితం చేస్తుంది. మధుమేహం ఉన్నవారికి ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
టీతో పాటు కారం లేదా పులుపు ఎక్కువగా ఉండే ఆహారాలను అస్సలు తినకూడదు. దీనివల్ల కడుపులో ఆమ్లత్వం పెరుగుతుంది. ఇది క్రమంగా కడుపులో పుండ్లు అల్సర్ లాంటి ఇతర జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.
చాలా మందిలో ఉండే అలవాటు ఏంటంటే మందులు వేసుకున్న వెంటనే టీ తాగుతారు. ఇది చాలా ప్రమాదకరం. టీలో ఉండే కెఫిన్, టానిన్లు మెడిసిన్ పనితీరును తగ్గిస్తాయి. దాంతో మందులలో దుష్ప్రభావాలు పెరుగుతాయి. కాబట్టి, మాత్రలు వేసుకున్న వెంటనే టీ తాగడం చేయకుండదు.
పప్పు, చేపలు, కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను కూడా టీతో పాటు తినకూడదు. దీనివల్ల శరీరంలో కాల్షియం శోషణ తగ్గి ఎముకల బలం తగ్గుతుంది ఆస్టియోపొరోసిస్ సమస్యలు వస్తాయి. కాబట్టి టీ విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి.