Side Effects Of Bread: వామ్మో.. రోజు బ్రెడ్ తిటున్నారా.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా.. నిపుణులు ఎం చెప్తున్నారు?

నిజానికి బ్రెడ్ ని ప్రాసెస్ చేసిన పిండితో తయారు చేస్తారు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఉండదు. కాబట్టి ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుందట.

Side Effects Of Bread: వామ్మో.. రోజు బ్రెడ్ తిటున్నారా.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా.. నిపుణులు ఎం చెప్తున్నారు?

Side effects of white bead

Updated On : June 9, 2025 / 12:56 PM IST

బ్రెడ్.. ఇది చాలా మంది తినే సాధారణమైన ఆహరంలో ఒకటి. ఉదయం టీలో, లేదా ఈవినింగ్ స్నాక్స్ రూపంలో బ్రెడ్ ను తింటూ ఉంటారు. ఎవరికైనా ఆరోగ్యం బాలేకపోయినా కూడా బ్రెడ్ తినిపిస్తూ ఉంటారు. చిన్న పిల్లలకు కూడా ఎక్కువగా బ్రెడ్ ను తినిపిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే.. బ్రెడ్ త్వరగా జీర్ణం అవుతుంది. సత్వర శక్తిని అందిస్తుంది. కానీ, బ్రెడ్ ను ఎక్కువగా తీసుకుంటే మాత్రం జగ్రత్తగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. ఎక్కువగా బ్రెడ్ ను తినడం వల్ల అనేకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశము ఉందట. మరి ఆ బ్రెడ్ వల్ల వచ్చే ఆ సమస్యలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

నిజానికి బ్రెడ్ ని ప్రాసెస్ చేసిన పిండితో తయారు చేస్తారు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఉండదు. కాబట్టి ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుందట. ఫైబర్ ఆహారాన్ని జీర్ణం చేయడంలో మెరుగా పనిచేస్తుంది. కాబట్టి మలబద్దకం దరిచేరదు. బ్రెడ్ లో ఫైబర్ కంటెంట్ లేకపోవడం వల్ల మలబద్దకం సమస్య వచ్చే అవకాశం చాలా ఉందట. బ్రెడ్‌ ఎక్కువగా తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా బలహీనపడుతుందటఅంతేకాకుండా అపానవాయువు, ఆమ్లత్వం, గ్యాస్ సమస్యలు కూడా వస్తాయని చెప్తున్నారు నిపుణులు. కానీ, ఈ మధ్య కాలంలో వినిస్తున్న మాట ఏంటంటే.. బ్రెడ్ తినడం వల్ల క్యాన్సర్ వస్తుందా అని. ఇటీవల జరిగిన ఏ అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని ప్రూవ్ చేయలేదు. క్యాన్సర్ కారకాలకు బ్రెడ్ ఏ విదంగాను సపోర్ట్ చేయదని చెప్తున్నారు. కాబట్టి, బ్రెడ్ అధికంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేదు.

అయితే.. వైట్ బ్రెడ్ తినడం కంటే బ్రౌన్ బ్రేడ్ తినడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. వైట్ బ్రెడ్ తో పోలిస్తే బ్రౌన్ బ్రెడ్ లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. కొన్ని సందర్భాల్లో వైట్ బ్రెడ్ షుగర్ లెవల్స్ ను పెంచుతుంది. కానీ, బ్రౌన్ బ్రెడ్ షుగర్ ని కంట్రోల్ చేసేందుకు సహాయపడుతుంది. కాబట్టి, బ్రెడ్ తినడం మంచిదే కానీ, బ్రౌన్ బ్రెడ్ తినడం ఇంకా మంచిది.