Health Tips: మధ్యాహ్నం తిన్న తరువాత ఈ పనులు అస్సలు చేయకండి.. చాలా మంది చేసే పొరపాటు ఇదే

Health Tips: భోజనం చేసిన వెంటనే చాలా మంది నిద్రకు ఉపక్రమిస్తారు. అలా తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది.

Health Tips: మధ్యాహ్నం తిన్న తరువాత ఈ పనులు అస్సలు చేయకండి.. చాలా మంది చేసే పొరపాటు ఇదే

Doing these things after lunch can damage your health

Updated On : July 27, 2025 / 3:25 PM IST

మన శరీరానికి శక్తిని అందించడం కోసం భోజనం అనేది చాలా అవసరం. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పూట ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే అంత మంచిది. అందులోను.. మరీ ముఖ్యంగా మధ్యాహ్న భోజనం చాలా ప్రధానమైనది. ఇది మన ఆరోగ్యం విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే, మనం సాధారణంగా చేసే కొన్ని పొరపాట్ల వలన ఆహారం యొక్క ప్రయోజనాలు శరీరానికి అందకుండా పోయే ఆవకాశం ఉంది. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. మరి ఆ పొరపాట్లు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.

1.తక్షణమే నిద్రపోవడం:
భోజనం చేసిన వెంటనే చాలా మంది నిద్రకు ఉపక్రమిస్తారు. అలా తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఆహారం పూర్తిగా జీర్ణం కాదు. దీనివల్ల గ్యాస్, అజీర్తి, కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తవచ్చు. భోజనం చేసిన తరువాత కనీసం 30 నిమిషాల వ్యవధి తరువాత నిద్రపోవడం మంచి అలవాటు.

2.తక్షణమే స్నానం చేయడం:
చాలా మందికి తిన్న వెంటనే స్నానం చేసే అలవాటు ఉంటుంది. కానీ, ఇలా భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల రక్తప్రసరణ జీర్ణక్రియ వైపు కాకుండా చర్మం వైపు మళ్లుతుంది. ఫలితంగా ఆహారం జీర్ణం కాదు. దీనివల్ల కూడా అజీర్తి, అలసట వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి, భోజనం చేసిన కనీసం గంట తర్వాత స్నానం చేయడం మంచిది.

3.సిగరెట్ త్రాగడం:
కొంతమంది భోజనం చేసిన వెంటనే సిగరెట్ తాగుతారు. ఇది చాలా ప్రమాదకరం. తిన్న తరువాత సిగరెట్ తాగడం వల్ల నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. భోజనం తరువాత శరీర భాగాలు జీర్ణక్రియపై కేంద్రీకృతమవుతుంది. అలాంటి సమయంలో సిగరెట్ తీసుకోవడం అనేది ఆరోగ్యానికి ప్రమాదకరం.

4.తక్షణమే నడకకు వెళ్లడం:
తిన్న తరువాత నడవాలని చాలా మంది వెంటనే నడవడం మొదలుపెడతారు. కానీ ఆ సమయంలో నడక ఎక్కువగా చేస్తే జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. కాబట్టి, తిన్న తరువాత 20 నుంచి 30 నిమిషాల తరువాత మాత్రమే నడవాలి. తేలికగా నడవడం అనేది జీర్ణక్రియకు సహాయపడుతుంది కానీ వెంటనే నడవకూడదు.

5.చల్లటి నీరు, పండ్ల రసాలు తాగడం:
భోజనం చేసిన వెంటనే చల్లటి నీరు లేదా పండ్ల రసాలు తాగడం మంచిది కాదు. ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. అజీర్తి, గ్యాస్, అలసట వంటి సమస్యలకు ఇది కారణం అవుతుంది. చల్లటి పదార్థాలు జీర్ణశక్తిని మందగింపజేస్తాయి. తిన్నాక కనీసం 30 నిమిషాల తరువాతే రసాలు లేదా చల్లటి నీరు తీసుకోవాలి.

సాధారణంగా మనం చేసే చిన్న చిన్న తప్పులే ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మధ్యాహ్న భోజనం తరువాత ఈ అలవాట్లను మార్చుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చు.