ప్రపంచం చెప్తుంది: మునగకాయే సూపర్ హీరో

మన చుట్టూ ఉండే పోషకాల గురించి మనమే పట్టించుకోం. ఎవరో చెప్తే గానీ తెలియదు వాటి విలువేంటో.. దక్షిణ భారతంలో విరివిగా దొరికే మునగకాయ గురించి వరల్డ్ ఎకానమిక్ ఫోరం చెప్తేనే దాని గురించి ఇంత ఉందా అనిపిస్తోంది. దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఆయుర్వేదంలోనూ, యోగాలోనూ ఆద్యులైన భారతీయులు ఎన్నో విశిష్టతలు చెప్పినా పెద్దగా పట్టించుకోలేదు.
ఇప్పుడు పరిశోధనలు జరిపి మరీ శాస్త్రవేత్తలు చెప్తుంటేనే ఒప్పుకుంటున్నాం. వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ ఛీఫ్ ఎరిక్ సోలెం దేశీవాలీ కూరగాయల్లో ఒకటైన మునగకాయను తెగపొగిడేస్తున్నారు. ఒక సూపర్ హీరోతో పోలుస్తూ.. మన భారతదేశంలోనే కాకుండా దక్షిణా ఆసియా దేశాల్లోనూ ఇది దర్శనమిస్తుందట.
‘వారంతా మునగ చెట్టును సంరక్షిస్తుంటారు. అనేక రకాలైన దీర్ఘకాలిక వ్యాధులకు మందులా పనిచేస్తుంది. ప్రకృతిపరంగా, వైద్యపరంగా ఎన్నో రకాల ప్రయోజనాలకు మూలం. నీటిని వడకట్టడంలో కీలకంగా వ్యవహరించి బయో ఫెర్టిలైజర్‌గా పనిచేస్తుంది. భవిష్యత్‌లో సూపర్‌ఫుడ్ అవుతుందనడంలోనూ ఆశ్చర్యం లేదు’ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.
ఈ ట్వీట్‌కు చాలా మంది భారతీయుల నుంచి చక్కటి స్పందన వచ్చింది. బయటి వాళ్లు మన మొక్కలపై చూపే ప్రేమ, బాధ్యత మనం కూడా చూపించాలంటూ హితవు పలుకుతున్నారు.
Also Read: ఎన్నారైల పెళ్ళి రిజిష్ట్రేషన్ తప్పని సరి : లేకపోతే ఆస్తులు జప్తు
Also Read: CBI మాజీ బాస్‌కు సుప్రీం తీర్పు : లక్ష కట్టు.. కోర్టులో ఓ మూలన కూర్చో
Also Read: మగ మినిస్టర్ చేతిదూల : వేదికపైనే మహిళా మంత్రిని గోకారు
Also Read: మనిషి బ్రతకటం కష్టమే : 100 ఏళ్లకు పురుగులు అంతం