Healthy Food: రాత్రి భోజనానికి ఈ 5 రకాల ఫుడ్ తీసుకోండి.. మంచి నిద్ర, మంచి ఆరోగ్యం మీసొంతం
Healthy Food: రాత్రి భోజనంలో ఎక్కువగా కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా సొరకాయ, బీరకాయ, దోసకాయ, గుమ్మడికాయ లాంటివి తీసుకోవడం మంచిది.

Eat these 5 types of food for dinner, it is good for your health
మనం రోజు తీసుకొనే ఆహారంలో రాత్రి భోజనం చాలా ముఖ్యమైనది. ఇది తేలికగా, జీర్ణమయ్యేలా ఉండాలి. ఎందుకంటే, రాత్రి పూట అధిక ఫ్యాట్, కార్బోహైడ్రేట్లు, మసాలా పదార్థాలు తీసుకుంటే గ్యాస్, అజీర్నం, నిద్రలేమి, బరువు పెరగడం లాంటి అనారోగ్యాలు ఏర్పడతాయి. అందువల్ల రాత్రి భోజనం తగినంత ఆరోగ్యకరమైనదిగా ఉండేలా చూసుకోవాలి. మరి రాత్రి భోజనానికి ఎలాంటి ఆహారం తీసుకోవడం మంచిది అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
1.కూరగాయలు:
రాత్రి భోజనంలో ఎక్కువగా కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా సొరకాయ, బీరకాయ, దోసకాయ, గుమ్మడికాయ లాంటివి తీసుకోవడం మంచిది. ఎందుకంటే, వీటిలో తక్కువ కేలరీలు ఉంటాయి. కాబట్టి, ఇవి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. అతి తక్కువ ఉప్పు, నూనెతో వండితే ఇంకా మంచిది. వీటిని ఉడికించి, తక్కువ నూనెతో, మసాలాలు లేకుండా తినడం వల్ల మంచి ఆరోగ్యం శరీరానికి అందుతుంది.
2.గోధుమ లేదా జొన్న రోటీ:
గోధుమ లేదా జొన్న రోటీ బ్రౌన్ రైస్ కంటే తేలికగా జీర్ణమవుతుతాయి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటాయి. బరువు నియంత్రణకు తోడ్పడుతుంది. పప్పుతో లేదా ఉడికించిన కూరగాయలతో కలిపి వీటిని తినడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి.
3.పెరుగు:
రాత్రి పూట పెరుగు తినకూడదు అంటారు. కానీ, తక్కివ మోతాదులో పెరుగు తినడం వల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. ప్రొబయాటిక్స్‌తో పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతాయి. నిద్రకు మేలిచేస్తుంది. అయితే తక్కువ కొవ్వు ఉండే పెరుగు రాత్రి తినడం మంచిది.
4.పప్పు లేదా సూప్స్:
పప్పులు శరీరానికి అవసరమైన ప్రోటీన్ ను అందిస్తాయి. కాబట్టి రాత్రి పూట తుర్ దాల్, మినప పప్పు, ములిగటానీ సూప్, కూరగాయల సూప్ తీసుకోవడం మంచిది. వీటిలో ప్రోటీన్‌తో పాటు తక్కువ కొవ్వు ఉంటుంది. త్వరగా జీర్ణమవుతుంది. రాత్రి ఆకలిని తీర్చడంలో సహాయపడుతుంది. ఎక్కువ నూనె, కారం, ఉప్పు లేకుండా ఉడకబెట్టి తినాలి.
5.నెమ్మదిగా జీర్ణమయ్యే ఫలాలు:
రాత్రి పూట కొన్ని రకాల పండ్లు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. యాపిల్, పపాయా, జామపండు లాంటివి తినాలి. వీటిలో సహజంగా తక్కువ చక్కెర ఉంటాయి. ఇవి శరీరానికి విటమిన్లు అందిస్తాయి. ఫైబర్ సమృద్ధిగా ఉండి జీర్ణానికి ఉపయోగపడతాయి. రాత్రి భోజనం తరువాత ఒక అరగంట గ్యాప్ తీసుకుని తినడం వల్ల గొప్ప ఆరోగ్యం అందుతుంది. అది కూడా అధికంగా తినకూడదు.
కాబట్టి, ఈ ఐదు రకాల ఫుడ్ రాత్రి తీసుకోవడం మంచిది. ఇవి:
- తేలికగా జీర్ణమవుతాయి
- శరీరానికి పోషకాలు అందిస్తాయి
- నిద్రకు మేలు చేస్తాయి
- ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుతాయి
ముఖ్యమైన సూచనలు:
రాత్రి భోజనాన్ని రాత్రి 7:00 నుంచి 8:00 గంటల మధ్యలో పూర్తిచేయాలి.
తిన్న తర్వాత 15 నుంచి 20 నిమిషాలు నడవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
నీరు ఎక్కువగా త్రాగాలి, కాని నిద్రకి ముందు త్రాగకూడదు.