ఆసియా బయట ఇదే ఫస్ట్: ఫ్రాన్స్‌లో కరోనా వైరస్ సోకి ఒకరు మృతి

  • Published By: sreehari ,Published On : February 15, 2020 / 03:03 PM IST
ఆసియా బయట ఇదే ఫస్ట్: ఫ్రాన్స్‌లో కరోనా వైరస్ సోకి ఒకరు మృతి

Updated On : February 15, 2020 / 3:03 PM IST

ఫ్రాన్స్‌లో కరోనా వైరస్ సోకి చైనా పర్యాటకుడు ఒకరు మృతిచెందారు. ఇది ఆసియా బయట కరోనా వైరస్ సోకి మృతిచెందిన తొలి వ్యక్తిగా ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు చైనాలో ఇప్పటివరకూ వైరస్ బారినపడి 1,500 మందికి పైగా మృతిచెందగా, కొత్తగా 2,641 మందికి వైరస్ సోకినట్టు నేషనల్ హెల్త్ కమిషన్ గుర్తించింది.

దీంతో మొత్తంగా చైనాలో దాదాపు 66, 500 వరకు కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్రమైన వుహాన్ నగరంలోని ప్రజలను ఇంట్లో నుంచి బయటకు రానివ్వడం లేదు. అక్కడ వారిందరిని ఇంట్లోనే బందీలుగా నిర్బంధించారు అధికారులు. వైద్య పరీక్షల కోసం మాత్రమే వుహాన్ సిటీలోని నివాసితులను ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు అనుమతినిస్తున్నారు. 

ఇతర నగరాల్లో మాత్రం పూర్తిగా తాళం వేసేశారు. ప్రతి కొన్నిరోజులకు ఆహారం కొనేందుకు మాత్రమే అక్కడి నగరవాసులను బయటకు వచ్చేందుకు అనుమతినిస్తున్నారు. వుహాన్ సిటీ పక్క ప్రాంతాల్లో లోపలికి బయటకు వచ్చేందుకు బారికేడ్లను ఉంచారు అధికారులు. పొరుగు ప్రాంతాల వారిని లోపలికి వచ్చేందుకు అనుమతించడం లేదు. చైనా బయట వైపు వైరస్ లక్షణాలు కనిపించడం లేదు. జపాన్, మలేసియాలో కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 

థాయిలాండ్ మాదిరిగా ఈ రెండు దేశాల్లోనూ మొదటి స్థానిక హెల్త్ వర్కర్ కు వైరస్ సోకినట్టు నిర్ధారించారు. ఇక, ఫారీస్ లో 80ఏళ్ల వ్యక్తికి వైరస్ సోకి మృతిచెందినట్టు ఫ్రెంచ్ ఆరోగ్య శాఖ మంత్రి అగ్నేశ్ బ్యుజిన్ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి నుంచి పారిస్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు ఆమె తెలిపారు. ఫ్రాన్స్ లో మరో ఆరుగురికి వైరస్ సోకినట్టు చెప్పారు.