Keep Your Fridge Clean: ఫ్రిడ్జ్ వాడేవారు ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.. లేదంటే ఆహారం విషంగా మారవచ్చు
Keep Your Fridge Clean: ఫ్రిడ్జ్ లో ఉంచే ఆహారరం, పళ్ళు, కూరగాయలు, ఉల్లిపాయలు వంటి వాటిని ఓపెన్‌గా ఉంచడం వల్ల క్రాస్ కంటామినేషన్ ఏర్పడుతుంది.

Fridge users must take these precautions
రిఫ్రిజిరేటర్.. ఇది మన రోజువారీ జీవనశైలిలో ఓ కీలక భాగంగా మారిపోయింది. ఇది ఆహార పదార్థాలను తాజాగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అయితే, ఫ్రిడ్జ్ ను సరైన విధంగా ఉపయోగించకపోతే అదే మన ఆరోగ్యానికి ప్రమాదకరమయ్యే అవకాశమూ ఉంది. ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసే ఆహారం విషంగా మారే అవకాశం ఉంది. కాబట్టి, చాలా ఫ్రిడ్జ్ విషయంలో చాల జాగ్రత్తలు పాటించాలి. మరి ఆ జాగ్రతలు ఏంటి? ఎలా పాటించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలి?
- ఫ్రిడ్జ్ సరైన ఉష్ణోగ్రతలో లేకపోతే బ్యాక్టీరియా పెరుగుతుంది.
- ఎక్స్పైరీ డేట్ అయినా ఆహారం ఫ్రిడ్జ్ లో నిల్వ చేస్తే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది.
- ఆహారం సరిగ్గా మూసివేయకుండా ఉంచితే క్రాస్ కంటామినేషన్ జరుగుతుంది.
తప్పనిసరిగా తీసుకోవలసిన జాగ్రత్తలు:
1. ఫ్రిడ్జ్ ఉష్ణోగ్రత సరిచూసుకోవాలి:
ఫ్రిడ్జ్ లోపల ఉష్ణోగ్రత 0°C – 4°C మధ్య ఉండాలి. ఫ్రీజర్ ఉష్ణోగ్రత -18°C కంటే తక్కువగా ఉండాలి.
2.ఆహారాన్ని కవర్ చేసి ఉంచాలి:
ఫ్రిడ్జ్ లో ఉంచే ఆహారరం, పళ్ళు, కూరగాయలు, ఉల్లిపాయలు వంటి వాటిని ఓపెన్‌గా ఉంచడం వల్ల క్రాస్ కంటామినేషన్ ఏర్పడుతుంది. ఎయిర్ టైట్ కంటైనర్లు లేదా ప్లాస్టిక్/గ్లాస్ డబ్బాలు ఉపయోగించడం మంచిది.
3.పాతవి ముందు, కొత్తవి వెనుక వాడుకోవాలి:
ఇది పాత ఆహారాన్ని తొలగించేందుకు, అవి వృథా కాకుండా తినేందుకు సహాయపడుతుంది. తాజాగా తెచ్చిన ఆహారాలను కాకుండా అంతకుముందే ఉన్న ఆహార పదార్థాలను వాడుకోవడం వల్ల వృధా తగ్గుతుంది.
4.వేడి ఆహారం వెంటనే ఉంచకూడదు:
వేడి ఆహారాన్ని ఫ్రిడ్జ్‌లో ఉంచితే లోపల ఉష్ణోగ్రత పెరిగి ఇతర ఆహారాలపై ప్రభావం పడుతుంది. ఆహారం గోరువెచ్చగా అయ్యాక మాత్రమే ఫ్రిడ్జ్‌లో పెట్టాలి.
sమనం వాడుకునే ఫ్రిడ్జ్ ను వారం లేదా 15 రోజులకు ఒకేసారి పూర్తిగా ఖాళీ చేసి శుభ్రం చేసుకోవాలి. బేకింగ్ సోడా లేదా నిమ్మరసం ఉపయోగించడం వల్ల చెడ్డ వాసన తొలగించవచ్చు.
5.ఫ్రిడ్జ్‌ను పూర్తిగా నింపకూడదు:
గాలి ప్రవాహం ఉండేలా చూసుకోవాలి. ఫ్రిడ్జ్ పూర్తిగా నిండిపోయి ఉంటే, చల్లదనం సమానంగా విస్తరించదు. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో ఆహారం త్వరగా పాడవుతుంది.
సురక్షితమైన ఆహారం అంటే ఆరోగ్యకరమైన జీవితం అని అర్థం. ఫ్రిడ్జ్‌ను కేవలం నిల్వ చేసే పరికరంగా కాకుండా, ఒక ఆహార భద్రతా జాగ్రతిని పాటించే వ్యవస్థగా చూడాలి. మీరు ఈ చిన్నచిన్న నియమాలను పాటిస్తే, ఆహారం విషంగా మారే ప్రమాదం చాలా వరకు తగ్గిపోతుంది.