Monsoon Health Tips: వర్షాకాలంలో చల్లటి నీళ్ళకి బదులు వేడి నీళ్లు తాగండి.. ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?

Monsoon Health Tips: వర్షాకాలంలో సాధారణంగా జలుబు, గొంతునొప్పి, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా వ్యాపిస్తాయి. కాబట్టి వేడి నీళ్లు తాగడం వల్ల గొంతులో ఉండే బ్యాక్టీరియా, వైరస్లను నశిస్తాయి.

Monsoon Health Tips: వర్షాకాలంలో చల్లటి నీళ్ళకి బదులు వేడి నీళ్లు తాగండి.. ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?

Health benefits of drinking hot water during monsoon

Updated On : July 24, 2025 / 2:23 PM IST

వర్షాకాలంలో వాతావరణం చల్లగా మారుతుంది. గాలిలో తేమ పెరిగిపోవడం, సూక్ష్మజీవుల ప్రబలత అధికమవడం వల్ల ఇన్‌ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ కాలంలో దోమల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి డెంగ్యూ, మలేరియా వంటి విషయ జ్వరాలు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి, ఈ సమయంలో ఆరోగ్యం పట్ల కొన్ని ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. అందులోను మంచి నీళ్ల విషయంలో. ఎందుకంటే, వర్షాకాలంలో చల్లటి నీళ్లకు బదులు వేడి నీళ్లు తాగడం ఆరోగ్యపరంగా ఎంతో మేలుగా చేస్తుందట. ఇది నిపుణులు చెప్తున్న మాట. మరి వర్షాకాలంలో వేడి నీళ్లు తాగడం వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.

1.జలుబు, దగ్గు నివారణ:
వర్షాకాలంలో సాధారణంగా జలుబు, గొంతునొప్పి, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా వ్యాపిస్తాయి. కాబట్టి వేడి నీళ్లు తాగడం వల్ల గొంతులో ఉండే బ్యాక్టీరియా, వైరస్లను నశిస్తాయి. అలాగే గొంతునొప్పి, పడిశం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

2.జీర్ణవ్యవస్థ మెరుగుదల:
వేడి నీళ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, శరీరంలోని టాక్సిన్లు బయటకు పంపిస్తాయి. అలాగే వర్షాకాలంలో కొంతమంది అజీర్తి సమస్యలతో బాధపడుతుంటారు. వేడి నీళ్లు తాగడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.

3.కడుపులో మంటను తగ్గిస్తుంది:
వర్షాకాలంలో అధిక తేమ కారణంగా కొంతమందికి బ్లోటింగ్ సమస్యలు ఎక్కువగా వస్తాయి. వేడి నీళ్లు తాగడం ద్వారా పేగుల్లో ఉండే వాయువు తొలగిపోయి నొప్పి సమస్యకు ఉపశమనం లభిస్తుంది.

4.ఇమ్యూనిటీ పెరుగుతుంది:
వేడి నీళ్లు తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా సహకరిస్తుంది.

5.చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది:
వర్షాకాలంలో గాలి తడి ఉండటం వల్ల చర్మం బిగుతుగా తయారవుతుంది. వేడి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లి చర్మం ఆరోగ్యంగా మెరిసేలా అవుతుంది.

6.మూత్రపిండాల శుభ్రత:
వేడి నీళ్లు తరచుగా తాగడం వల్ల మూత్రపిండాల్లో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. సాధారణంగా వర్షాకాలంలో నీరు తక్కువగా తాగుతారు. కాబట్టి మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది. అలాంటప్పుడు వేడి నీళ్లు ఆ సమస్యను తగ్గిస్తుంది.

వర్షాకాలంలో వేడి నీళ్లు తాగడం అనేది ఒక చిన్న అలవాటే అయినప్పటికీ దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. జలుబు, జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లకు నిరోధకత వంటి అనేక అంశాల్లో మేలు చేస్తుంది. కాబట్టి, రోజులో 3 నుంచి 4 సార్లు వేడి నీళ్లు తాగడం వల్ల మంచి ఆరోగ్యం పొందవచ్చు.