Healthy Diet Tips: సన్నబడాలని తినడం మానేస్తున్నారా.. రిస్క్ చేస్తున్నారు జాగ్రత్త.. ఇది ఫాలో అవ్వండి
Healthy Diet Tips: ఆహారమే శరీరానికి ఇంధనం. తినకుండా ఉంటే శరీరానికి అవసరమైన శక్తి లభించదు. దీని వలన తల తిరుగుతుంది, అలసట వస్తుంది.

Health risks of stopping eating to lose weight
ప్రెజెంట్ జనరేషన్ లో యువత కాస్త లావుగా కనిపిస్తే చాలు సన్నబడాలని, స్లిమ్ గా అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు. సోషల్ మీడియా ప్రభావంతో, సన్నగా కనిపించాలనే ఆతృత ఎక్కువైంది. దాంతో వెంటనే, తినడం మానేయడం, లేదా తక్కువ తినడం మొదలుపెడతారు. దీన్ని డైట్ (dieting) అని భావించినా, ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది అని నిపుణులు చెప్తున్నారు. సరైన సమతుల్య ఆహారం లేకుండా శరీరాన్ని బలహీనంగా మార్చుకోవడం ద్వారా అనేక రకాల కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట. మరి దాని గురించి ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం.
తినడం మానేయడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు:
1.శక్తిలేని శరీరం (అలసట, బలహీనత):
ఆహారమే శరీరానికి ఇంధనం. తినకుండా ఉంటే శరీరానికి అవసరమైన శక్తి లభించదు. దీని వలన తల తిరుగుతుంది, అలసట వస్తుంది. శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఏ పని చేసినా శరీరమంతా బలహీనతతో బాధపడుతుంది
2.మానసిక ఒత్తిడి (మూడ్ స్వింగ్స్):
తినడం తగ్గించడం వల్ల మెదడు అవసరమైన గ్లూకోజ్‌ను పొందలేకపోతుంది. ఇది మానసిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల చికాకు, ఆందోళన, డిప్రెషన్, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు రావచ్చు.
3.పౌష్టికాహార లోపం:
తినడం మానేయడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు తక్కువగా అందుతాయి. దీనివల్ల పోషకాహార లోపం ఏర్పడి రక్తహీనత (అనీమియా), చర్మం పొడిబారడం, జుట్టు ఊడిపోవడం, ముక్కులో మచ్చలు, పెదవుల చీలిక వంటి సమస్యలు వస్తాయి.
4.మెటబాలిజం తగ్గుతుంది:
తినడం మానేస్తే శరీరం తక్కువ కాలరీలను ఖర్చు చేస్తుంది. దీని వల్ల బరువు తక్కువ కాకపోగా విరుద్ధంగా కొవ్వు నిల్వలు పెరిగే అవకాశం ఉంటుంది. రీబౌండ్ వెయిట్ గెయిన్ జరుగుతుంది.
5.హార్మోన్ల అసమతుల్యత:
ఆహారం తగినట్లుగా లేకపోతే హార్మోన్లు అసమతుల్యంగా మారతాయి. దీనివల్ల మహిళల్లో మెన్స్ మిస్ అవటం, మానిపోవటం, హైరాన్ ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీ సమస్యలు, థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది.
6.గుండె ఆరోగ్యానికి ప్రమాదం:
తినడం మానేయడం లేదా తక్కువగా తినడం వల్ల కలరీలు చాలా తక్కువగా అందుతాయి. దీనివల్ల హార్ట్ ఫంక్షన్‌కి అవసరమైన ఎనర్జీ అందదు. ఫలితంగా గుండె పనితీరు క్షీనిస్తుంది. కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ కూడా దెబ్బతింటుంది.
బరువు తగ్గే సరైన మార్గం ఏమిటి?
- సమతుల్యమైన డైట్: కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫైబర్, మంచి కొవ్వులను ఎక్కువగా తీసుకోవాలి.
- రోజు తక్కువ పరిమాణాల్లో ఎక్కువసార్లు తినాలి: దీనివల్ల మెటబాలిజం మెరుగవుతుంది
- వ్యాయామం, యోగా, వాకింగ్ వంటి శారీరక శ్రమ వల్ల బరువు సహజంగా తగ్గవచ్చు
తినకపోవడం వల్ల తాత్కాలికంగా బరువు తగ్గినట్లుగా అనిపించినా, దీర్ఘకాలంలో అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే, సన్నబడాలన్న లక్ష్యం కోసం శరీరాన్ని కష్టపెట్టడం కంటే ఆరోగ్యకరమైన మార్గాలను ఎంచుకోవడం ఉత్తమం.