Healthy Snacks: వర్షాకాలంలో పిజా, బర్గర్, ఆలు స్నాక్స్ వద్దు.. ఇవి తినండి.. రుచితో పాటు అద్భుతమైన ఆరోగ్యం

Healthy Snacks: పిజ్జా, బర్గర్ మైదా (refined flour), ఉప్పు, చీజ్, సాస్‌లతో తయారు చేయబడతాయి. కాబట్టి, శరీరంలో కొవ్వు పెరగడానికి కారణమై జీర్ణ సమస్యలు కలిగిస్తాయి.

Healthy Snacks: వర్షాకాలంలో పిజా, బర్గర్, ఆలు స్నాక్స్ వద్దు.. ఇవి తినండి.. రుచితో పాటు అద్భుతమైన ఆరోగ్యం

Healthy snacks to eat in the evening during the rainy season

Updated On : July 28, 2025 / 12:25 PM IST

వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. ఆ సమయంలో వేడి వేడిగా ఏదైనా తినాలని సహజంగా అనిపిస్తుంది. ప్రజెంట్ మార్కెట్ లో చాలా రకాల స్నాక్స్ అందుబాటులోకి వచ్చాయి. పిజాలు, బర్గర్లు, ఆలు చిప్స్, మిరపకాయ బజ్జీలు ఇలా చాలానే ఉన్నాయి. రుచిగా కూడా ఉంటాయి. అందుకే వీటిని సాయంత్రం పూట తినడానికి ఇష్టపడతారు. కానీ, వర్షాకాలంలో ఇలాంటి స్నాక్స్ తీసుకోవడం అసలు మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. ఇవి అనేకరకాల సమస్యలకు కారణం అవ్వొచ్చని చెప్తున్నారు. మరి వర్షాకాలంలో ఎలాంటి స్నాక్స్ తినడం మంచిది అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

ఈ ఆహారాల్ని తినకండి:

1. పిజ్జా, బర్గర్:
ఇవి అధికంగా మైదా (refined flour), ఉప్పు, చీజ్, సాస్‌లతో తయారు చేయబడతాయి. కాబట్టి, శరీరంలో కొవ్వు పెరగడానికి కారణమై జీర్ణ సమస్యలు కలిగిస్తాయి. వర్షాకాలంలో జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి పొట్టనొప్పులు, గ్యాస్, అజీర్తి లాంటి సమస్యలకు దారితీస్తాయి.

2.ఆలూ బజ్జీలు, స్నాక్స్:
ఆలూ బజ్జీలు ఎక్కువగా నూనెలో వేయించి చేస్తారు. కాబట్టి, ఇవి శరీరానికి హానికరం. ఒక్కోసారి వాడిన నూనెను మళ్ళీ మళ్ళీ ఉపయోగించడంతో టాక్సిన్లు (విషపదార్థాలు) ఏర్పడతాయి.

3.శుభ్రత లోపం:
వర్షాకాలంలో తడిగా ఉండడం వల్ల ఆహార పదార్థాల్లో సూక్ష్మజీవులు (బ్యాక్టీరియా, వైరస్‌లు) త్వరగా పెరుగుతాయి. ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ కాలం నిల్వ ఉంచడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

ఇవి మంచి ప్రత్యామ్నాయాలు (ఆరోగ్యంగా, రుచిగా):

1.వేయించిన మక్కజొన్నలు (Roasted Corn):
నీటిలో ఉడికించిన లేదా మంటపై కాల్చిన మక్కజొన్న మంచి స్నాక్ గా చెప్పుకోవచ్చు. దీనిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

2.కూరగాయ ఉప్మా:
బ్రోకోలీ, క్యారెట్, బీన్స్ వంటి కూరగాయలతో చేసుకొనే ఉప్మా రుచికరంగా ఉండడమే కాకుండా ఆరోగ్యవంతంగా కూడా ఉంటుంది. తక్కువ నూనెతో తక్కువ వేడి మీద తయారుచేస్తే మంచి ఫలితాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది.

3.మినప్పప్పు సూప్ లేదా కూరగాయల సూప్:
మినప్పప్పు లేదా కూరగాయలతో చేసిన వేడి వేడి సూప్ వర్షపు చల్లదనాన్ని తగ్గించడంతో పాటు శరీరానికి తేలికగా జీర్ణమయ్యే పోషకాలను అందిస్తుంది.

4.పచ్చిమిర్చి/ వాము పకోడి:
పచ్చిమిర్చి లేదా వాము పకోడి చాలా మంది రోజు తయారుచేసుకునేదే. వీటిని తక్కువ మోతాదులో మంచి నూనెతో ఇంట్లోనే తయారు చేసుకొని తినడం మంచి ఆప్షన్ కింద చెప్పుకోవచ్చు. వాము జీర్ణక్రియకు సహకరిస్తుంది.

5.రాగి జావ / మిలెట్ దోస:
రాగి లేదా చిరు దాన్యాలతో తయారుచేసిన దోసలు సాయంత్రం తినడానికి మంచి ఎంపిక. వీటిలో కూడా ఫైబర్, ఐరన్, ప్రోటీన్‌ అధికంగా ఉంటాయి. వేడి వేడి దోసకు కొబ్బరి పచ్చడి జతచేసి తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది.

6.మొలకెత్తిన శెనగల సలాడ్:
సాయంత్రం స్నాక్స్ కోసం మొలకెత్తిన శనగల సలాడ్ చాలా మంది ఎంపిక. ఇది సులభంగా తయారుచేసుకోదగిన స్నాక్. బీట్రూట్, ఉల్లిపాయలు, నిమ్మరసం కలిపితే తింటే అద్భుతంగా ఉంటుంది. వీటిలో కూడా ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.