కరోనా వైరస్ చైనా సరిహద్ధులను దాటింది. హాంకాంగ్ లో ఓ వ్యక్తిని బలితీసుకొంది

కరోనా వైరస్ సోకి హాంకాంగ్ లో ఒక వ్యక్తి మరణించాడు. చైనా లోని వూహాన్ నగరంలో మొదలైన వైరస్ ఇప్పుడు ప్రపంచంలోని 25 దేశాలను గజగజలాడిస్తోంది. వైరస్ సోకి చైనా బయట జరిగిన రెండవ మరణంగా దీన్ని ధృవీకరిస్తున్నారు. ఇటీవల ఫిలిప్పీన్ లో44 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్ తో మరణించాడు. హాంకాంగ్ లో ఇప్పటి వరకు 15 మందికి వైరస్ సోకింది. వారిని ఆస్పత్రుల్లోని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
కరోనావైరస్ సోకి చైనాలో ఇప్పటి వరకు 425 మంది మరణించినట్లు తెలిసింది. మరో 20 వేల మందికి పైగా వైరస్ బారినపడి చికిత్స పొందుతున్నారు. హాంకాంగ్ కు చెందిన 39 ఏళ్ళ వ్యక్తి జనవరి 21న వుహాన్ నగరానికి వెళ్లాడు. అతను 2 రోజుల్లో తిరిగి స్వదేశానికి తిరిగి వచ్చాడు. వచ్చి రావటంతోటే కరోనా వైరస్ లక్షణాలతో అతను ఆస్పత్రిలో చేరాడు.
రక్తపరీక్షలు నిర్వహించగా అతడికి వైరస్ సోకినట్లు తేలింది. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశాడు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం( ఫిబ్రవరి3) అర్థరాత్రి నుంచి చైనా భూభాగంతో ఉన్న 13 సరిహద్దు క్రాసింగ్ ను హాంకాంగ్ మూసివేసింది. కరోనావైరస్ గ్లోబల్ మార్కెట్లను కుదిపేసింది. పలు విమానాయాన సంస్ధలు చైనాకు తిరిగే సర్వీసులను నిలిపివేశాయి.