కరోనా వైరస్‌ను శరీరం ఎంతవరకు తట్టుకోగలదు?

కరోనా వైరస్ ఒకరినుంచి మరొకరికి ఎంత వేగంగా వ్యాపిస్తుందో.. మనిషి శరీరంపైనా అంతే వేగవంతంగా ప్రభావం చూపిస్తుంది. శరీరంలోని రోగ నిరోధక శక్తిపై దాడి చేసి తన ఉనికిని చూపించి ప్రాణాలను హరిస్తుంది. అసలు ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ పై ఎంతవరకూ ప్రభావం చూపించగలదు. 60ఏళ్లు పైబడ్డ వారి పరిస్థితి ఏంటి.. ఈ జబ్బు బారినపడితే ఇక అంతేనా.. జాన్స్ హాప్ కిన్స్ యూనివర్సిటీకి చెందిన ఆండ్రూ పెకోజ్ ఏమంటున్నారు.
Novel coronavirus వైరస్‌పై పూర్తి స్థాయి అధ్యయనం చేయకపోయినప్పటికీ ఇతర కరోనా వైరస్ లతో పోల్చి చూసిన పరిశోధకులు.. కీలక విషయాలు వెల్లడించారు. నిర్ణీత సమయం తర్వాత ఇది మళ్లీ ఇన్ఫెక్షన్ చూపించొచ్చని అంటున్నారు. (నెల్లూరులో కరోనా కేసులు అధికం…ఎందుకు)
ఎలా దాడి చేస్తుంది:
శరీరంపైన వైరస్ అటాక్ చేసిన సమయంలో ఇమ్యూన్ సిస్టమ్ యాంటీ బాడీలతో ఎదురుదాడి చేస్తుంది. అదెలాంటిదో పసిగట్టి దానికి తగ్గట్టు మెటబాలిజాన్ని సిద్ధం చేస్తుంది. అయితే అది శరీరంలో ఉన్నంత వరకూ దాడి చేస్తూనే ఉంటుండటంతో ఎదురుదాడి చేసే శక్తి ఉన్నంత వరకే మనిషి బతికి ఉండగలడు. ఈ దాడి చేసే క్రమంలో ఆరోగ్యంలో పలు మార్పులు కనిపిస్తూ ఉండొచ్చు. కానీ, రోగ నిరోధక శక్తి దానిని అధిగమించి తిరిగి యథాస్థితికి వచ్చేంతవరకూ పోరాడుతుంది.
ఎంతవరకూ పోరాడగలం:
ఇమ్యూనిటీ సిస్టమ్ పై దాడి చేసే వాటిలో కొన్ని కొద్ది రోజుల వరకూ మాత్రమే ఉండి పోతాయి. చికెన్ పాక్స్, పోలియో లాంటి వైరస్ లు సైతం ఇదే కోవకు చెందినవే. మిగిలిన వైరస్ లు అంత ప్రభావం చూపించకపోవచ్చు. కరోనా వైరస్.. లాంటివి కొన్ని నెలలు కంటే ఎక్కువ కాలం కూడా ఉండొచ్చు. వీటి కారణంగా తరచూ తుమ్ములు రావడం గమనించొచ్చు. (లాక్‌డౌన్‌ని ధిక్కరించి దేవాలయాల్లో భక్తులు: పోలీసులపై దాడులు)
వ్యాక్సిన్లు ఎంతవరకూ పనిచేస్తాయి:
వైరస్ లపై శరీరం సహజంగానే పోరాడుతుంది. వీటికి వ్యాక్సిన్ల రూపంలో వైరస్ క్రిములపై పోరాడే శక్తిని మాత్రమే ఇవ్వగలం. వాటితో పాటు ఇమ్యూన్ సిస్టమ్ కు వైరస్ ను కనుగొనే శక్తిని అందించగలం. అంతేకానీ, పూర్తిగా వ్యాక్సిన్ల ద్వారా తగ్గించలేం. రోగ నిరోధక శక్తి పెరగకపోతే ఎటువంటి వైరస్ ను ఎదుర్కోలేం.