వైరస్ నుంచి ఫేస్ మాస్క్‌లతో రక్షించుకోగలమా?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీ నుంచి వ్యాపించిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకూ ఈ వైరస్ బారిన పడి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మందికి #coronavirus సోకిందనే అనుమానంతో వారికి ప్రత్యేకమైన వసతితో పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కరోనా వైరస్.. మహమ్మారి అంటోంది. దీంతో గ్లోబల్ రిస్క్ తప్పదని హెచ్చరిస్తోంది.
కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ #WHO అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకూ పబ్లిక్ హెల్త్ ఎమర్జెనీ ఆఫ్ ఇంటర్నెషనల్ కన్సర్న్ (#PHEIC)ని ప్రకటించలేదు. చైనా నుంచి ఇతర దేశాలకు వ్యాపించిన ఈ వైరస్.. ఇండియాలోకి కూడా ప్రవేశించందంటూ వార్తలు వస్తున్నాయి. చైనా నుంచి భారత్ కు తిరిగివచ్చిన చాలామందికి అధికార యంత్రాంగం స్ర్కీనింగ్ టెస్టులు నిర్వహిస్తోంది.
Also Read : పూర్తి Visual Guide మీకోసం: ‘కరోనా’ వ్యాప్తికి అసలు కారణాలు ఇవే!
ఏవైనా అనుమానంగా లక్షణాలు కనిపిస్తే వెంటనే వారికి ప్రత్యేక వైద్య సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. సాధారణంగా గాలిద్వారా వ్యాపించే #2019-nCoV కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనేదానిపై చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు.
ఫేస్ మాస్క్ లకు ఫుల్ డిమాండ్ :
చైనాలో ఎక్కడ చూసిన ప్రతిఒక్కరూ ముఖానికి మాస్క్ లతో కనిపిస్తున్నారు. వైరస్ సోకకుండా మాస్క్ లతో తమను తాము రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు ఈ ఫేస్ మాస్క్ లతో వైరస్ సోకుండా పూర్తిగా అడ్డుకోగలమా? ఫేస్ మాస్క్ లు ఎంతవరకు ప్రాణాంతక వైరస్ ల నుంచి మనల్ని కాపాడుతాయి అనేదానిపై సందేహాలు ఉండి ఉండొచ్చు.
#coronavirus ప్రభావంతో ఆసియా వ్యాప్తంగా ఫేస్ మాస్క్ లకు భారీ గిరాకీ పెరిగింది. చైనాలోని నేషనల్ హెల్త్ కమిషన్ ఇప్పటికే తమ హెల్త్ కేర్ వర్కర్లకు మిలియన్ల కొద్ది ఫేస్ మాస్క్‌లను పంపించింది. వుహాన్ సిటీ వాసులందరికి ఈ మాస్క్ లను పంపినట్టు ఓ రిపోర్టు తెలిపింది. కానీ, ఈ మాస్క్ లు ప్రజలను వైరస్ బారి నుంచి రక్షించగలవా? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రెండు రకాల మాస్క్‌లు ఇవే :
కరోనా అనేది.. గాలిద్వారా వ్యాపించే వైరస్. ఒకరి నుంచి మరొకరికి ఈజీగా వ్యాపిస్తుంది. జంతువుల నుంచి మనుషుల్లోకి ఈ వైరస్ పాకిందని రీసెర్చర్లు నమ్ముతున్నారు. వైరస్ నుంచి రక్షించుకోవడానికి ముక్కు, నోరు మూసిఉండేలా మాస్క్ లు ధరిస్తుంటారు. ఇందులో రెండు రకాల ఫేస్ మాస్క్ లు అందుబాటులో ఉన్నాయి.
అందులో ఒకటి సర్జికల్ మాస్క్, రెండోది N95 ఫేస్ మాస్క్‌లు ఉన్నాయి. ఇందులో ప్రామాణిక సర్జికల్ మాస్క్.. సర్జన్ డాక్టర్లు ఆపరేషన్ చేసే సమయంలో ఈ మాస్క్ లు వాడుతుంటారు. ఇవి ద్రవ బిందువులను అడ్డుకుంటాయి. మరో వ్యక్తి నుంచి వైరస్ సోకేందుకు తక్కువగా అవకాశాలు ఉంటాయి.
కానీ, ఇలాంటి మాస్క్ లు గాలిద్వారా వ్యాపించే వైరస్ నుంచి పూర్తి రక్షణ ఇవ్వలేవు. ఎందుకంటే.. ఈ మాస్క్ లు ముక్కు, నోటిని పూర్తిగా మూసివేసి ఉంచవు. అతిచిన్న సూక్ష్మజీవులు ఈజీగా మాస్క్ మెటిరేయల్ నుంచి లోపలికి ప్రవేశించగలవు.
మాస్క్ ధరించినా కళ్లు తెరిచే ఉంటాయి కావునా కళ్ల ద్వారా కూడా వైరస్ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. వైరస్ ప్రభావం నుంచి కొంతమేరకు నియంత్రించగలవు గానీ పూర్తి స్థాయిలో ఫేస్ మాస్క్ లు రక్షణ ఇవ్వలేవని యూకేలోని యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్ బర్గ్ లో మార్క్ హూల్ హౌస్ వెల్లడించారు.
N95 ఫేస్ మాస్క్‌లు :
సర్జికల్ ఫేస్ మాస్క్ ల కంటే ఎక్కువ రక్షణ ఇవ్వగలవు ఈ ఎన్95 ఫేస్ మాస్క్ డివైజ్‌లు. కంటికి కనిపించని అతి సూక్ష్మమైన వైరస్ లను ముక్కు, నోటిలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. కానీ, ఈ మాస్క్‌లు సరైన క్రమంగా ధరిస్తే మాత్రమే పనిచేస్తాయి. చిన్నపిల్లలకు ఈ మాస్క్ లు సరిపోవు. ఫేషియల్ ఎయిర్ ఉన్న వారికి కూడా సరిపోవు.
N95 రెస్పైరేటర్స్ ధరించిన వ్యక్తికి శ్వాస తీసుకోవడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. దీంతో కొత్త కరోనా వైరస్ లక్షణాల మాదిరిగా ఇతరులకు మీరు కనిపించే ప్రమాదం ఉంది. వైరస్ సోకితే విపరీతమైన దగ్గు, శ్వాస తీసుకోలేకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైరస్ బారిన నుంచి బయటపడటానికి ఈ మాస్క్‌లు కూడా పూర్తి స్థాయిలో రక్షణగా ఉండలేవని చెప్పవచ్చు.
Read Also : సైంటిస్టులు కనిపెట్టేశారు:Coronavirus వెనుక షాకింగ్ రీజన్స్!