Acanthamoeba keratitis: 40 నిమిషాల్లో కన్ను తినేసిన బ్యాక్టీరియా.. కంటి చూపు కోల్పోయిన యువకుడు
ఫ్లోరిడాకు చెందిన మైకేల్ క్రుమోజ్ అనే 21 ఏళ్ల యువకుడికి కంటికి సంబంధించిన సమస్య ఉంది. దీంతో అతడు కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నాడు. అయితే, నిద్రపోయే ముందు ఆ కాంటాక్ట్ లెన్స్ తీసేయలేదు. దీంతో అతడి కంటికి అకాంత్ అమీబా కెరటైటిస్ ఇన్ఫెక్షన్ సోకింది.

Acanthamoeba keratitis: కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త! ఎందుకంటే ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మీ కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంది. తాజాగా అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఒక వ్యక్తి తన నిర్లక్ష్యం కారణంగా కంటి చూపు కోల్పోయే పరిస్థితి వచ్చింది.
WPL-2023: మార్చి 4 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం.. మహిళలకు టిక్కెట్లు ఉచితం
హానికర బ్యాక్టీరియా కంటిని తినేయడం వల్ల అతడి కన్ను కనబడకుండా తయారైంది. ఫ్లోరిడాకు చెందిన మైకేల్ క్రుమోజ్ అనే 21 ఏళ్ల యువకుడికి కంటికి సంబంధించిన సమస్య ఉంది. దీంతో అతడు కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నాడు. అయితే, నిద్రపోయే ముందు ఆ కాంటాక్ట్ లెన్స్ తీసేయలేదు. దీంతో అతడి కంటికి అకాంత్ అమీబా కెరటైటిస్ ఇన్ఫెక్షన్ సోకింది. ఇదో రకమైన బ్యాక్టీరియా. ఇది మనిషి శరీరంలోని కణజాలాన్ని తినగలదు. దీంతో అతడి ఎడమ కంటిని 40 నిమిషాల్లోనే బ్యాక్టీరియా తినేసింది. కంటి చూపునకు కారణయ్యే కార్నియా భాగాన్ని ఆ బ్యాక్టీరియా తినేసింది.
Lionel Messi: ప్రపంచ కప్ జట్టు ఆటగాళ్ల కోసం 35 గోల్డ్ ఐఫోన్లు కొన్న లియోనెల్ మెస్సీ
అతడు 40 నిమిషాలు నిద్రపోయి లేచేసరికి ఎడమ కంటి చూపు దాదాపు కోల్పోయాడు. దీంతో ఆస్పత్రికి వెళ్లగా అతడిని పరీక్షించిన వైద్యులు, ఈ బ్యాక్టీరియా గురించి వివరించారు. ప్రస్తుతం అతడి కన్ను స్వల్పంగా మాత్రమే కనిపిస్తోంది. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు. అతడి కంటి చూపు మెరుగవ్వాలంటే కార్నియా శస్త్ర చికిత్స చేయాలి. అప్పటికీ, పూర్తి కంటి చూపు రాకపోవచ్చు. పాక్షికంగా మాత్రమే కనిపించే అవకాశం ఉంది. కాంటాక్ట్ లెన్స్ వాడే వారిలో ఈ సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు.
ఈ రకమైన అమీబా ఏక కణ జీవి. ఇది గాలి, నీళ్లు, ధూళి.. ఇలా అనేక మార్గాల ద్వారా వ్యాపిస్తుంది. కాంటాక్ట్ లెన్స్ వాడే వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది నెమ్మదిగా కంటి కణజాలాన్ని తినేస్తుంది. దీంతో కంటి చూపు కోల్పోయే అవకాశం ఉంది.