Water Bottle In Car: వాటర్ బాటిల్ కారులో వదిలేస్తున్నారా.. ఇది చాలా ప్రమాదం.. విషంగా మారుతుందట.. ఇవి తెలుసుకోండి

ప్లాసిక్ బాటిల్ లోపల ఉంచితే దానిలోని ప్రమాదకరమైన రసాయనాలు నీటిలో కలిసే అవకాశం ఉంటుందట.

Water Bottle In Car: వాటర్ బాటిల్ కారులో వదిలేస్తున్నారా.. ఇది చాలా ప్రమాదం.. విషంగా మారుతుందట.. ఇవి తెలుసుకోండి

Water in car is danger

Updated On : June 13, 2025 / 11:42 AM IST

వాటర్ బాటిల్ లో నీళ్లు తాగడం ప్రమాదం అని ఇప్పటికే చాలా నివేదికలు చెప్పాయి. కానీ, తాజాగా మరో సంచలనమైన విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. చాలా మంది కారు ప్రయాణం అంటే వాటర్ బాటిల్ లో నీళ్లు తీసుకొని వెళ్తారు. కానీ, ఇలా కారులో ఉంచిన వాటర్ బాటిల్ లో నీళ్లు తాగడం అస్సలు మంచిది కాదట. అవి విషంగా మారి ప్రాణాంతకమైన వ్యాధులకు గురి చేసే అవకాశం ఉందట. ఈ విషయం గురించిన చాలా విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కారు ఎండలో పార్క్ చేసినప్పుడు సూర్యకాంతి వల్ల లోపల ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ సమయంలో ప్లాసిక్ బాటిల్ లోపల ఉంచితే దానిలోని ప్రమాదకరమైన రసాయనాలు నీటిలో కలిసే అవకాశం ఉంటుందట. క్రమంగా అది విషపూరితమైనదిగా మారే అవకాశం ఉందని తాజా అధ్యాయనాలు చెప్తున్నాయి. కారులో ఏర్పడే వేడి కారణంగా బిస్ఫినాల్-ఎ, ప్లాస్టిక్ లో ఉండే యాంటిమోనీ వంటి విషపూరితమైన రసాయనాలు నీటిలో కలిసిపోతాయట. ఈ నీటిని తాగడం వల్ల రసాయనాలు శరీరంలో పేరుకుపోయి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుందట. ఇది అనేక వ్యాధులకు కారణమవుతుందట.

సాధారణంగా ప్లాస్టిక్ బాటిళ్లు పాలిథిలిన్ టెరెఫ్తాలేట్‌తో తయారవుతాయి. వాటిని వేడి చేసినప్పుడు BPA, యాంటిమోనీ వంటి హానికరమైన పదార్థాలు విడుదల అవుతాయి. BPA శరీరంలోని హార్మోన్లపై ప్రభావం చూపించే రసాయనం. ఇది జీవక్రియను దెబ్బతీస్తుంది. గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలకు కారణం అవుతుంది. యాంటిమోనీ కడుపులోని ఎంజైమ్‌లను దెబ్బతీస్తుంది. ఇది విషపూరిత మూలకాలను తయారుచేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే కారు ప్రయాణంలో ప్లాసిక్ బాటిల్స్ వాడకం కంటే స్టీల్, గాజు బాటిల్‌ లను వాడటం మంచిది.