LUNG CAPACITY : కరోనాతో దెబ్బతిన్న ఊపిరితిత్తులు 3 నెలల్లో వాటింతటవే రిపేర్ చేసుకోగలవ్

కరోనా మహమ్మారి సోకినవారిలో చాలామందిలో ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కూడా వారి ఊపిరితిత్తులు వైరస్ ప్రభావంతో దెబ్బతింటున్నాయి.. కరోనా నెగటివ్ వచ్చినా కూడా వైరస్ ప్రభావం శరీరంలో ఏదో ఒక అవయవాన్ని దెబ్బతీస్తోంది.. అందులో ప్రధానంగా ఊపిరితిత్తులు.. కరోనా సోకి వెంటిలేటర్ ద్వారా చికిత్స తీసుకుని కోలుకున్నవారిలో ఈ సమస్య అధికంగా ఉంటోంది.. అయినప్పటికీ భయపడక్కర్లేదు.. కరోనాతో దెబ్బతిన్న ఊపిరితిత్తులు కేవలం 3 నెలల వ్యవధిలోనే వాటింతటవే రిపేర్ చేసుకుంటాయని నిపుణులు వెల్లడించారు.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రోగుల్లో లంగ్స్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నారు.. అయితే 12 వారాల (3 నెలలు) తర్వాత లంగ్స్ ఎలాంటి చికిత్స అవసరం లేకుండానే వాటికి అవే మెరుగుపడతాయని వైద్యులు తెలిపారు. ఆస్ట్రియాలోని టైరోలియన్ పరిశోధకులు, కరోనావైరస్ “hotspot” గా పిలుస్తారు. ఈ వైరస్ సోకిన 150 మందికి పైగా రోగులపై నిపుణులు అధ్యయనం చేశారు.
ఆస్ట్రియాలోని పలు ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకున్నారు. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయిన తరువాత పేషెంట్లను 6 నుంచి 12, 24 వారాల పాటు పర్యవేక్షించారు. ఈ సమయంలో రోగులను పరీక్షించి విశ్లేషించారు. తద్వారా ధమనుల రక్తంలో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ మొత్తాన్ని వైద్యులు కనుగొన్నారు.
ఊపిరితిత్తుల పనితీరుపై పరీక్షలు, కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) స్కాన్లు, ఎకోకార్డియోగ్రామ్‌లను కూడా వైద్యులు నిర్వహించారు. ఆరు వారాల పాటు పర్యవేక్షించగా.. సగానికి పైగా రోగులలో లంగ్స్ ఇన్ఫెక్షన్ ఒక లక్షణంగా ఉందని అంటున్నారు. అలాగే ఊపిరి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. స్కాన్లలో 88 శాతం మంది రోగులకు ఇప్పటికీ ఊపిరితిత్తుల దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
కానీ, 12 వారాల తర్వాత ఊపిరితిత్తులు దెబ్బతినడం 56 శాతం మేర తగ్గిందని నిపుణులు తెలిపారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సమస్యలతో బాధపడుతున్న వారు లైఫ్ లాంగ్ సమస్యను ఎదుర్కొనే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. UKలో వైరస్ నుంచి కోలుకున్న 75 శాతం పేషెంట్లలో ఇలాంటి లక్షణాలే ఉన్నాయని వెల్లడించిన కొద్ది వారాలకే నిపుణులు గుర్తించారు.
అధ్యయనంలో పాల్గొన్న కరోనా తగ్గిన పేషెంట్లలో సగటు వయస్సు 61ఏళ్లు కాగా వారిలో 65 శాతం మంది పురుషులే ఉన్నారు. దాదాపు సగం మందికి పోగతాగే అలవాటు ఉంది.. ఆస్పత్రిలో చేరిన వారిలో 65 శాతం మంది అధిక బరువు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నవారే ఉన్నారు. కరోనా పేషెంట్లలో ఆస్పత్రిలో సగటున 13 రోజులు, వారిలో 21 శాతం మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్నారని, 16 శాతం మంది వెంటిలేటర్‌పై ఉన్నారని అధ్యయనంలో తేలింది.
అధ్యయనంలో పాల్గొన్న రోగులందరిలో 56 శాతం మంది 6 వారాల పాటు లక్షణాలు కనిపించాయి.. శ్వాస సమస్య ఎక్కువగా ఉండగా.. దగ్గు ఎక్కుమ మందిలో కనిపించింది. సాధారణంగా ఊపిరితిత్తులలో మంట, నీరుచేరడం కారణంగా వైరస్ సోకిన వారిలో ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. వైరస్ బారిన పడిన రోగులు పల్మనరీ ప్రారంభించిన వెంటనే.. వారు పూర్తిస్థాయిలో కోలుకోవడానికి ఎక్కువ అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. రోగుల స్కాన్లలో మొత్తం ఊపిరితిత్తుల దెబ్బతినడం 6 వారాల్లో ఎనిమిది పాయింట్ల నుంచి వారం పన్నెండు నాటికి నాలుగు పాయింట్లకు తగ్గిందని వైద్యులు గుర్తించారు.