Harish Rao: AI ఆధారిత ఎథోస్ రేడియోథెరపీని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
చికిత్స గదిలో, వీడియో సహాయాన్ని ఉపయోగించి, రోగి స్థితిని గైడ్ చేయడంలో IDENTIFY™ సహాయపడుతుంది

AOI: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI) వేరియన్ IDENTIFY సాంకేతికతతో ఏర్పాటు చేసిన AI- ఆధారిత ఎథోస్ రేడియోథెరపీని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. క్యాన్సర్ చికిత్స రంగంలో ముఖ్యమైన మైలురాయిగా ఇది నిలువనుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. AI-ఆధారిత ఎథోస్ రేడియోథెరపీని అందుబాటులోకి తీసుకురావటంతో, AOI క్యాన్సర్ సంరక్షణలో నూతన ప్రమాణాలను ప్రవేశ పెట్టారని, తెలంగాణలో వెలుపల ఉన్న రోగులకు అత్యాధునిక సాంకేతికత చికిత్సను అందిస్తున్నారని మంత్రి కొనియాడారు.
ఈ కొత్త విధానం వల్ల మారుతున్న అవసరాలకు అనుగుణంగా రోగుల రోజువారీ రిపోర్టులను తీస్తూ క్యాన్సర్ చికిత్సను మరింత మెగురు పరిచేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు. చికిత్స గదిలో, వీడియో సహాయాన్ని ఉపయోగించి, రోగి స్థితిని గైడ్ చేయడంలో IDENTIFY సహాయపడుతుంది. రోగి అనాటమీ, ట్యూమర్ లొకేషన్ ఆధారంగా వాస్తవ సమయంలో చికిత్స ప్రణాళికను స్వీకరించడం ద్వారా ఎథోస్ చికిత్స వ్యక్తిగతీకరణ యొక్క ప్రత్యేక సామర్థ్యాలను తెస్తుంది.
USA Multnomah Falls : జలపాతం చూసేందుకు వెళ్లి లోయలో పడి వ్యక్తి మృతి.. భార్య, పిల్లలు చూస్తుండగానే
ఈ ఈ విషయమై మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ “హైదరాబాద్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్‌లో అత్యాధునిక ఎథోస్ రేడియోథెరపీ సిస్టమ్‌ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ ప్రజలకు అసాధారణమైన ఆరోగ్య సేవలను అందించడంలో ఈ అధునాతన పరికరాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు ప్రధాన కారణాలలో ఒకటైన క్యాన్సర్ స్థితిని పరిగణనలోకి తీసుకుంటే, ప్రతి ఒక్కరూ నివారణ చర్యగా తమ ఆరోగ్యం, జీవనశైలిని పరిశీలించుకోవడం అత్యవసరం. కాలుష్యం, ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు క్యాన్సర్‌కు దోహదపడే ప్రధాన కారకాలు’’ అని అన్నారు.