Noni Juce: నొని జ్యూస్ ఒక అద్భుతం.. ఈమధ్య స్టార్స్ ఎక్కువగా తాగుతున్నారు.. ఎందుకో తెలుసా?
నోని పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ సి, బీటా కెరోటిన్, ఐరిడాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్ములించి కణాలను బలోపేతం చేస్తాయి.

Noni juce benefits
నొని జ్యూస్.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వైరల్ అవుతున్న జ్యూస్ ఇది. కారణం ఏంటంటే.. ఇండియా లెవల్లో ఉన్న చాలా మంది స్టార్ ఈ జ్యూస్ ను తాగుతుండటమే. దాంతో నొని పండ్ల గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ నొని పండ్లు ఆసియాలోని కొన్ని దేశాలు, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో మాత్రమే అధికంగా దొరుకుతాయి. కొంతకాలం నుండి ఈ పండ్లకు డిమాండ్ బాగా పెరుగుతుండటంతో ఇండియాలో కూడా పండిస్తున్నారు. మరి ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ పండ్ల గురించి, అది అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నోని పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ సి, బీటా కెరోటిన్, ఐరిడాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్ములించి కణాలను బలోపేతం చేస్తాయి. అంతేకాకుండా క్యాన్సర్ కణాలను అరికడతాయి. నోని పండ్లు గుండె సమస్యలకు చెక్ పెడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పండ్లలో ఉండే స్కోపోలెటిన్, క్వర్సెటిన్ సమ్మేళనాలు యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఆర్థరైటిస్ నొప్పుల, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
నోని పండ్లను తినడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది. బరువు తగ్గడంలో ఇకూడా నోని జ్యూస్ అద్భుతంగా పని చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. నోని జ్యూస్ తాగడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. ప్రమాదకరమైన ఫ్యాటీ లివర్ సమస్య నుండి కాపాడుతుంది.
నోని పండ్లులో సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తాయి గుణాలు ఉన్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ జ్యూస్‌ను తాగడం వల్ల మెడ, కీళ్ల నొప్పులు నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండ కండరాలు బలానికి, కండరాల నొప్పులు తగ్గడానికి కూడా ఈ పండ్లు దోహదపడతాయి. నోని పండ్లు బీపీని సైతం తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. గుండె ఆరోగ్యంగా ఉండి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.