Peanut Butter : బరువు పెంచటంతోపాటు, బరువును తగ్గించటలోను సహాయపడే పీనట్ బటర్!

పీనట్‌ బటర్‌ ఎక్కువ మొత్తంలో కాకుండా తగిన మోతాదులో తీసుకుంటే బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. అలా కాకుండా అధికమొత్తంలో తీసుకుంటే బరువు తగ్గడానికి బదులు పెరిగే ప్రమాదమే ఎక్కువ.

Peanut Butter : బరువు పెంచటంతోపాటు, బరువును తగ్గించటలోను సహాయపడే పీనట్ బటర్!

Peanut butter

Updated On : September 7, 2022 / 2:00 PM IST

Peanut Butter : అధిక బరువును తగ్గించుకునే అనేక మంది పలు రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొవ్వులు, క్యాలరీలు తక్కువగా ఉండే పదార్థాల్ని మాత్రమే ఆహారంలో చేర్చుకుంటుంటారు. అయితే కొవ్వులు , క్యాలరీలు అధిక మోతాదులో ఉండే పీనట్ బటర్ బరువును పెంచటంలోనే కాక, బరువును తగ్గించటంలోను ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఉండే పీచు పదార్థమే ఇందుకు కారణమని అంటున్నారు. పీనట్ బటర్ లో ఉండే ప్రొటీన్లు ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. దీంతో ఆకలి అనిపించదు.తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ విలువ కలిగిన ఈ పదార్థం జీవక్రియల పనితీరును మెరుగుపరుస్తుంది. అధిక బరువును తగ్గించుకునేందుకు ప్రేరేపిస్తాయి.

పల్లి, నువ్వులు, డ్రైఫ్రూట్స్‌తో తయారుచేసిన చిక్కీలాలను మమూలుగా తినకుండా కాస్త పీనట్ బటర్ జోడించుకుని తీసుకుంటే రుచితోపాటు బరువు సులభంగా తగ్గవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు ఉప్పు కలపకుండా ఉండే పీనట్ బటర్ ను ఎంపిక చేసుకోవాలి. ఉప్పు కలిపితే శరీరంలో సోడియం స్థాయులు పెరిగిపోయి కడుపుబ్బరంతో పాటు బరువు పెరుగుతారు.

పీనట్‌ బటర్‌ ఎక్కువ మొత్తంలో కాకుండా తగిన మోతాదులో తీసుకుంటే బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. అలా కాకుండా అధికమొత్తంలో తీసుకుంటే బరువు తగ్గడానికి బదులు పెరిగే ప్రమాదమే ఎక్కువ. మార్కెట్లో దొరికే దానికన్నా సొంతగా తయారు చేసుకున్నది తీసుకోవటం ఆరోగ్యానికి శ్రేయస్కరం. పండ్లతో సలాడ్‌ చేసుకున్నప్పుడు నిమ్మరసం, సాస్ వంటి వాటితో కలిపి పీనట్ బటర్ జోడించటం వల్ల మంచి రుచి వస్తుంది. స్మూతీస్‌, పండ్ల రసాలు చేసుకునేటప్పుడు కాస్త పీనట్‌ బటర్‌ను ఉపయోగించటం వల్ల ఫలితం ఉంటుంది.

ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా ఓట్‌మీల్‌ తీసుకుంటుంటారు. అయితే ఇందులో టీస్పూన్‌ పీనట్‌ బటర్‌ కలుపుకొని తీసుకుంటే బరువు తగ్గే ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. పీనట్‌ బటర్‌ను ఐస్‌క్రీమ్స్‌, చాక్లెట్స్‌ వంటి వాటితో కలిపి తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. వీటిలో చక్కెర, క్యాలరీలు అధికమోతాదులో ఉన్నందున బరువు పెరుగుతారు.

పీనట్ బటర్ తయారీ విధానం ;

ముందుగా తగినన్ని పల్లీల్ని తీసుకుని తక్కువ మంటపై వేయించుకొని చల్లారనివ్వాలి. తరువాత పొట్టు తొలగించుకోవాలి. మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ముద్దగా తయారైన తరువాత రుచి కోసం అవసరమైతే టీస్పూన్‌ తేనె వేసుకోవచ్చు. ఇలా తయారైన బటర్‌ను వివిధ ఆహారపదార్ధాలతో కలిపి తీసుకోవచ్చు.