Cold Water Bath: మీకు తెలుసా?.. ఇలాంటి వ్యక్తులు చల్లటి నీటితో స్నానం చేయకూడదు.. చేస్తే ఏమౌతుందటే?
గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు చల్లని నీటితో స్నానం చేయకూడదట. కారణం ఏంటంటే.. స్నానం చేస్తున్నప్పుడు ఒంటిపై అలా చల్లటి జల్లులు పడినప్పుడు రక్తనాళాలు కుచించుకుపోతాయే ప్రమాదం ఉందట.

Cold water bath problems
ఎండాకాలం.. చన్నీళ్ళ స్నానం.. అబ్బా చెప్తుంటేనే ఎంత హాయిగా ఉంది కదా. చాలా మంది ఇదే ఫాలో అవుతారు. మండే ఎండలో ఉక్కపోతను తరిమికొట్టేలా చళ్లని నీళ్లతో స్నానం చేయడానికి ఇష్టపడతారు. కానీ, ఇది అందరికీ మంచిది కాదట. కొన్ని ఆరోగ్యసమస్యలు ఉన్నవారు చన్నీళ్ళ స్నానానికి దూరంగా ఉండాలని నిపుణులుక్ చెప్తున్నారు. మరి ఏ సమస్య ఉన్నవారు చన్నీళ్ళ స్నానం చేయకూడదు? కారణం ఏంటి? చేస్తే ఏమౌతుంది అనేది తెల్సుకుందాం.
వేసవిలో చన్నీళ్ళ స్నానం మంచి ఆప్షన్ కానీ, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు చల్లని నీటితో స్నానం చేయకూడదట. కారణం ఏంటంటే.. స్నానం చేస్తున్నప్పుడు ఒంటిపై అలా చల్లటి జల్లులు పడినప్పుడు రక్తనాళాలు కుచించుకుపోతాయే ప్రమాదం ఉందట. దీనివల్ల రక్త ప్రవాహంలో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందట. ఇది రక్తపోటు తోపాటు గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతుందట. కరోనరీ ఆర్టరీ వ్యాధి ఉన్నవారికి చల్లని నీటి స్నానం మరింత తీవ్రంగా మారుస్తుందట.
మధుమేహంతో బాధపడుతున్న వారు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు చన్నీటి స్నానం చేయడం వల్ల సమస్యలు మరింత పెరిగిపోతాయట. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కూడా చల్లని నీటి స్నానానికి దూరంగా ఉండాలని చెప్తున్నారు.
హైబీపీ ఉన్నవారికి గుండె సంబంధ వ్యాధులకు దగ్గర సంబంధం ఉంటుంది. అందుకే రక్తపోటుతో ఉన్నవారు కూడా చల్లని నీటిని శరీరంపై పోసుకోకూడదు. చల్లని నీరు చర్మంపై పడగానే శరీరం ఒకరకమైన షాక్ కి గురవుతుంది. ఇది రక్తపోటును అధికం చేస్తుంది. దానివల్ల స్ట్రోక్, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సమస్య ఉన్నవాళ్లు చన్నీళ్ళ స్నానానికి దూరంగా ఉండటం మంచిది.
వృద్ధులు కూడా చన్నీళ్ళ స్నానం చేయడం మంచిది కాదు. వీరిలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అది గుండె సమస్యలకు కారణం అవుతుంది.