Health Tips: ఉదయం పొట్ట ఉబ్బినట్టుగా ఉంటుందా? ఇదే కారణం.. ఇలా చేయండి
Health Tips: రాత్రి సమయంలో అధిక మోతాదులో, నూనె, మసాలాలు, గాస్ కలిగించే పదార్థాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల అది పూర్తిగా జీర్ణం కాకపోవచ్చు.

Reasons for a hard stomach in the morning
మన రోజువారి జీవితంలో ఎదో ఒకరమైన ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిలో ఉదయం పొట్ట గట్టిగా అనిపించడం ఒకటి. నిద్రలేచిన వెంటనే పొట్ట ఉబ్బినట్టుగా, గట్టిగా అనిపించడం వల్ల చాలా అసౌకర్యంగా ఉంటుంది. తీవ్రమైన ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే, ఇది కొందరికీ సాధారణమే అయినా, దీని వెనక కొన్ని ఆరోగ్య సంబంధిత కారణాలు ఉంటాయని, నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెప్తున్నారు. మరి ఉదయం పొట్ట గట్టిగా మారడానికి గల ముఖ్య కారణాలు, వాటి నివారణ చర్యల గిరించి వివరంగా తెలుసుకుందాం.
ఉదయం పూట పొట్ట గట్టిగా అనిపించడానికి ప్రధాన కారణాలు:
1.రాత్రి ఆహారం జీర్ణం కాకపోవడం:
రాత్రి సమయంలో అధిక మోతాదులో, నూనె, మసాలాలు, గాస్ కలిగించే పదార్థాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల అది పూర్తిగా జీర్ణం కాకపోవచ్చు. దీంతో పొట్టలో గ్యాస్ ఏర్పడి ఉదయం గట్టిగా అనిపించవచ్చు.
2.గ్యాస్ ఏర్పడడం:
శరీరంలో జీర్ణక్రియ జరుగుతున్న సమయంలో గ్యాస్ ఏర్పడటం సాధారణమే. బీన్స్, పాల ఉత్పత్తులు, కార్బొనేటెడ్ డ్రింక్స్ లాంటి కొన్ని ఆహార పదార్థాలు అధిక గ్యాస్ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీనివల్ల కూడా పొట్ట గట్టిగా మారే అవకాశం ఉంది.
3. నీటి కొరత:
రాత్రిపూట మనం నీరు తాగకుండా 6 నుంచి 8 గంటలు నిద్రలో గడిపేస్తాము. కాబట్టి, ఆ సమయంలో శరీరానికి తగినంత హైడ్రేషన్ దొరకదు. దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది, గ్యాస్ బయటకు రావడం ఆలస్యం అవుతుంది.
4.నిద్రపోయే తీరు:
మనం పడుకునే భంగిమలు కూడా జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. పొట్టమీద పడుకోవడం వల్ల పేగుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. దానివల్ల జీర్ణక్రియకు ఆటంకం కలిగి బ్లోటింగ్ కి దారితీయవచ్చు.
5.హార్మోన్ల ప్రభావం (ప్రత్యేకించి మహిళల్లో):
ఆడవాళ్లకు పీరియడ్స్ సమయంలో కొన్ని హార్మోన్ల ప్రభావంతో ద్రవం నిల్వ (fluid retention) ఎక్కువవుతుంది. ఈ కారణం వల్ల కూడా పొట్ట ఉబ్బినట్లు గా అనిపించవచ్చు.
నివారణ చర్యలు:
1.సరైన ఆహారపు అలవాట్లు:
- రాత్రిపూట తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలా
- ఎక్కువగా గ్యాస్ కలిగించే పదార్థాలు బీన్స్, కార్బొనేటెడ్ డ్రింక్స్, ఫ్రైడ్ ఫుడ్ తగ్గించాలి.
- తినే ముందు, తిన్న తర్వాత కాసేపు నెమ్మదిగా నడవాలి
2.తగినంత నీరు తాగాలి:
- ఉదయం గోరువెచ్చని నీటిని త్రాగడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది.
- రోజూ శరీరానికి సరిపడా నీరు తాగడం వల్ల టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి.
3.వ్యాయామం/యోగా చేయాలి:
- ప్రతి రోజూ కనీసం 20 నుంచు 30 నిమిషాలు నడక/యోగా చేయాలి.
- పవనముక్తాసనం, వజ్రాసనం, అర్ధ మత్స్యేంద్రాసనం లాంటి ఆసనాలు bloating ను తగ్గిస్తాయి
4.సరైన నిద్ర అవసరం:
- పడుకునే 2 నుంచి 3 గంటల ముందు ఆహారం తీసుకోవాలి.
- ఎడమ వైపు పడుకోవడం జీర్ణక్రియకు అనుకూలంగా ఉంటుంది.
5.ప్రొబయోటిక్స్ తీసుకోవడం:
- పెరుగు, బటర్ మిల్క్ వంటి ప్రొబయోటిక్ పానీయాలు జీర్ణక్రియకు మేలుచేసే బ్యాక్టీరియాను పెరిగేలా చేస్తాయి.