Salt Treatment : ఉప్పులో పాతేస్తే ఒత్తిడి పోతుందట .. సాల్ట్ ట్రీట్‌మెంట్‌తో సాటిలేని ప్రయోజనాలు

ఒకప్పుడు చంపి ఉప్పు పాతర వేస్తాను జాగ్రత్త అంటూ బెదిరించేవారు. కానీ ఇప్పుడు కావాలని డబ్బులిచ్చి మరీ ‘ఉప్పు’పాతర వేయించుకుంటున్నారు. ఎందుకంటే ఆరోగ్యం కోసం..

Salt Treatment : ఉప్పులో పాతేస్తే ఒత్తిడి పోతుందట .. సాల్ట్ ట్రీట్‌మెంట్‌తో సాటిలేని ప్రయోజనాలు

salt Treatment for Health

salt Treatment for Health  : ‘ఉప్పు’ వంటకాలకు రుచినివ్వటమేకాదు శరీర, మానసిక ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందనే విషయం మీకు తెలుసా..? ఉప్పులో పాతేస్తే ఒత్తిడి పోతుందట..అంటే మానసిక ఆరోగ్యానికి ఉప్పు అంత బాగా పనిచేస్తుందటం. దుబాయ్ లోనే ఉప్పు గుహల్లో చికిత్స పొందేవారి సంఖ్య పెరుగుతోంది. అంటే ఉప్పు ట్రీట్ మెంట్ కు మంచి గిరాకీ పెరిగిందన్నమాట. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లోని ఉప్పు గుహల్లో ‘ఉప్పు’పాతర వేయించుకుంటున్నారు మనుషులు. ఒకప్పుడు చంపి ఉప్పు పాతర వేస్తాను జాగ్రత్త అంటూ బెదిరించేవారు. కానీ ఇప్పుడు కావాలని డబ్బులిచ్చి మరీ ‘ఉప్పు’పాతర వేయించుకుంటున్నారు.

అలాగయునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ అల్‌ అయిన్‌లోని ఉప్పు గుహలో అలీ హమద్‌ అబ్దెల్‌మెనెమ్ (Ali Hamad Abdelmenem)అనే వ్యక్తి ఉప్పు చికిత్స పొందారు. చికిత్స కోసం ఇక్కడకు వచ్చినవారిని ఇలా ఉప్పుతో శరీరం మొత్తం కప్పేస్తారు. పోలండ్‌లోని క్రాకోవ్‌ నగరం ( Cracow, city in Poland) నుంచి తీసుకొచ్చిన ఈ ఉప్పులో నెగెటివ్‌ అయాన్లు (negative ions,minerals) సహా సోడియం( sodium ), మెగ్నీషియం ( magnesium)వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని, దానివల్ల ఒత్తిడి తగ్గి, శరీరానికి సంబంధించిన అనేక రుగ్మతలు నయమవుతాయని భావిస్తుంటారు. దీంతో ఇక్కడకు ట్రీట్ మెంట్ కు వచ్చే వారి సంఖ్య పెరుగుతోందట..ఈ ఉప్పు ట్రీట్ మెంట్ ను సాల్ట్ థెరపీ (Salt therapy)అంటారు. ఉప్పులో అలా శరీరం మొత్తాన్ని కప్పేస్తే మానసిక ఒత్తిడి నుంచి రిలీఫ్ (anti-stress treatment)కలుగుతుందట.శరీరం కూడా చక్కటి ఉత్తేజం పొందుతుందట..

Alternative To Tomatoes : టమాటాలకు బదులు ఇవి వాడుకోండి .. వంటకాలకు రుచికి రుచీ..డబ్బు కూడా ఆదా..

సాల్ట్ థెరపీని హలోథెరపీ లేదా స్పెలియోథెరపీ అని కూడా పిలుస్తారు. ఈ చికిత్స వల్ల శ్వాసకోశ సమస్యలు దూరమవుతాయట. పైగా ఈ చికత్స వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్టులు రావని చెబుతున్నారు. ఈ ఉప్పు థెరపీ ఇప్పటిది కాదు..పురానత కాలం నుంచి వస్తోందని చారిత్రక ఆధారాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. జలుబు,చర్మ సంబంధిత సమస్యలకు సాల్ట్ థెరపీ చక్కటి పరిష్కామని పరిశోధనల్లో తేలింది.

పోలాండ్ కు చెందిన బోస్కో విన్ స్కీ అనే ప్రముఖ డాక్టర్ 1843లో ఉప్పు గుహాల ఆరోగ్య ప్రయోజనాలను గురించి పోలాండ్ లోని వెల్కిజ్ కా నగరంలోని ఉప్పు గనుల్లో అనేక ప్రయోగాలు చేసారు. ఉప్పు థెరపీతో ఆరోగ్యాన్ని ఎలా పొందొచ్చో పరిశోధనల ద్వారా నిరూపించారు. సహజసిద్ధమైన ఉప్పు రోగనిరోధకశక్తి పెంచడమే కాకుండా , శ్వాసకోశ సమస్యలను నయం చేయడానికి ఉపకరిస్తుందని బోస్కో విన్ స్కీ పరిశోధనల్లో తేలాయి. ఉప్పు చికిత్స శాస్త్రీయపరంగా ఎలా పనిచేస్తుందనే విషయాల పై చాలా ఆధారాలను చూపించగా విమర్శకులు కూడా ఆయన పరిశోధనలపై ప్రశంసలు కురిపించారు.

కాగా తూర్పు ఐరోపాలో 19 శతాబ్దం ప్రారంభం నుంచి ఉప్పు థెరపీ చికిత్స చేసేవారట. ఈక్రమంలో దుబాయ్ లో సాల్ట్ థెరపీ సూట్ లు నిర్మించింది. దీంతో ఇక్కడ ఉప్పు చికిత్స్ కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. మంచి ఆదరణ లభించటంతో దుబాయ్ లో కొత్త కొత్త ఉప్పు గుహలు నిర్మిస్తున్నారు. ఈ ఉప్పు గుహల నిర్మాణంలో భాగంగా దుబాయ్ లోని జుమేరా లేక్స్ టవర్స్ లో ప్రత్యేకంగా మొట్టమొదటి ఉప్పు రూమ్ ను ప్రారంభించారు. ఈ సాల్ట్ ట్రీట్ మెంట్ కు ఆదరణ పెరగటంతో యూఏఈలో ఉప్పు గుహలు నిర్మాణాలు పెరగటంతో ఇక్కడకు సాల్ట్ ట్రీట్ మెంట్ కోసం వచ్చేవారి సంఖ్య పెరుగుతోందట.

ఈ సాల్ట్ సూట్ లలో ప్రశాంతంగా కూర్చున్నా..ఉప్పుతో శరీరం మొత్తం కప్పేసుకున్నా..మొటిమలు వంటి సమస్యలతో పాటు తామర,సోరియాసిన్ వంటి పలు సమస్యలు తగ్గుతాయట. సైనసైటిస్, బ్రోన్కైటిస్, ఆస్తమా వంటి సమస్యలు తీరిపోతాయట. మన భారత దేశంలో హిమాలయాలు,బల్గేరియాలో లభించే స్వచ్ఛమైన, మినరల్-రిచ్ ఉప్పు, ఔషధ ఉప్పు అంటారు. స్వచ్ఛమైన ఉప్పులో 84 రకాల మినరల్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వాటిని పీల్చటం వల్ల శరీరక, మానసిక ఆరోగ్యం కలగుతుందంటున్నారు. కాగా ఈ ఉప్పు గుహల్లో వారి వారి సమస్యల తీవ్రతను బట్టి కనీసం ఆరు సెషన్స్ గా ట్రీట్ మెంట్ ఇస్తారు నిపుణులు. ధూమ పానంతో వచ్చే శ్వాస కోస సమస్యలకు ఈ సాల్ట్ ట్రీట్ మెంట్ చక్కటి శ్వాసను కలిగిస్తుందంటున్నారు. ఈ సాల్ట్ ట్రీట్ మెంట్ వల్ల అలెర్జీలు, చర్మవ్యాధులు వంటి దీర్ఘకాలిక సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుందట.

Weight Loss: సర్జరీ అవసరమే లేదు.. ఇవి తింటూ సులువుగా బరువు తగ్గించుకోండి!

సాల్ట్‌ రూమ్‌ థెరపీ (Salt therapy)పూర్తి సహజమైనదని, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఇది స్వస్థత చేకూరుస్తుందని నిపుణులు అంటున్నారు. స్వల్ప పరిమాణంలో గాలి నిరంతరం సరఫరా అవుతున్న గదిలో కూర్చున్న తర్వాత గాలిలో కలిసే ఉప్పు రేణువులు నాసిక ద్వారా లోపలికి వెళ్లిన అడ్డంకులను తొలగిస్తాయని బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మ్యూకస్‌ సాధారణంగా ప్రయాణించేలా చేసి అస్తమాను నియంత్రిస్తాయని..అస్తమా(Asthma), క్రానిక్‌ బ్రాంకైటిస్(chronic bronchitis), సైనసైటిస్(sinusitis), అలర్జిక్(allergic), చర్మ వ్యాధుల( skin disease)కు ఇది ఒక ప్రత్యామ్నాయచికిత్సగా పనిచేస్తుందని చెబుతున్నారు. వర్కవుట్‌ చేసి అలసిపోయిన శరీరం మళ్లీ తిరిగి యథాతధ స్థితికి రావడానికి సాల్ట్ ట్రీట్ మెంట్ బెస్ట్ గా ఉపయోగపడుతుంది. క్రీడాకారులకు, గాయాలకు కు ఉండే గొంతు సమస్యలను నివారిస్తుంది సాల్ట్‌ థెరపీ.