Paralysis Symptoms: పక్షవాతాన్ని ముందే గుర్తించండి.. లక్షణాలు ఇవే.. జాగ్రత్త పడండి
Paralysis Symptoms; పక్షవాతం (Paralysis) అనేది శరీరంలోని ఒక భాగం లేదా భాగాలను నియంత్రించలేని పరిస్థితి. ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.

Some early signs and precautions for detecting paralysis
పక్షవాతం (Paralysis) అనేది శరీరంలోని ఒక భాగం లేదా భాగాలను నియంత్రించలేని పరిస్థితి. ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇది నరాలవ్యవస్థలో (nervous system) లో సమస్య వల్ల కలుగుతుంది. ముఖ్యంగా మెదడులో లేదా రక్తనాళాల్లో సమస్యలు, గుండె ఆఘాతం లేదా మెదడులో రక్తస్రావం వంటి కారణాల వల్ల ఇది సంభవించవచ్చు. మరి అంతటి ప్రమాదకరమైన పక్షవాతాన్ని ముందుగానే గుర్తించడానికి సహాయపడే ముఖ్య లక్షణాల గురించి తెలుసుకుందాం.
పక్షవాతం ప్రధాన లక్షణాలు:
1.ఒకవైపు చేతి లేదా కాళ్ళ / కదలని స్థితి:
పక్షవాతం తరచుగా శరీరంలోని ఒకవైపు మాత్రమే ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, కుడిచేయి, కుడికాలు పూర్తిగా బలహీనంగా మారడం లేదా కదలకపోవడం.
2.ముఖంలో వికృతమైన మార్పులు:
ముఖంలోని ఒకవైపు నిచ్చెనట్లు తల వాలిపోవడం లేదా నవ్వే ప్రయత్నంలో ఒకవైపు స్పందించకపోవడం. ఈ లక్షణాన్ని “Face droop” అంటారు.
3.సరిగా మాట్లాడలేకపోవడం (Speech difficulty):
పక్షవాతం ఉన్న వ్యక్తి స్పష్టంగా మాట్లాడలేకపోతారు. మాటలు అస్పష్టంగా రావడం, కొన్నిసార్లు పూర్తిగా మాట్లాడలేకపోవడం కూడా జరుగుతుంది.
4.శరీర సమతుల్యత కోల్పోవడం:
సరిగా నడవలేకపోవడం. తడపడటం లేదా బరువు నియంత్రణ కోల్పోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి.
5.చేతులు పైకి లేపలేకపోవడం (Arm weakness):
రెండు చేతుల్ని ఒకేసారి పైకి లేపమని అడిగితే ఒకచేయి జారిపోవడం గమనించవచ్చు. ఇది పక్షవాతాని సూచనే.
6.తల తిరగడం, తల బరువుగా మారడం:
తల తిరుగుతున్నట్టు అనిపించటం, గందరగోళంగా అనిపించటం మొదలైనవి కూడా కొన్ని సందర్భాల్లో పక్షవాతం సంకేతాలు కావచ్చు.
“FAST” పద్ధతి:
- F – Face: ఒకవైపు ముఖం వాలిపోవడం నవ్వమంటే ముఖం అసమానంగా కనిపించుతుందా?
- A – Arms: రెండు చేతుల్ని పైకి లేపలేకపోవడం
- S – Speech: స్పష్టంగా మాట్లాడగలేకపోవడం
- T – Time: ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి.
ఇతర సహాయక లక్షణాలు:
- చూపు మసకబారడం
- మెమరీ లోపం
- గందరగోళం
- మూర్ఛ
పక్షవాతం అనేది అత్యవసర వైద్య పరిస్థితి. తొందరగా గుర్తించి వైద్య సహాయం తీసుకుంటే గణనీయంగా కోలుకోవచ్చు. ఎప్పుడైనా పై లక్షణాలలో ఏవైనా కనిపిస్తే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెంటనే తీసుకెళ్లాలి.