భారత్‌లో కరోనా విజృంభణ: సరిహద్దులు, స్కూళ్లు, సినిమాలు బంద్!

  • Published By: sreehari ,Published On : March 12, 2020 / 02:20 AM IST
భారత్‌లో కరోనా విజృంభణ: సరిహద్దులు, స్కూళ్లు, సినిమాలు బంద్!

Updated On : March 12, 2020 / 2:20 AM IST

భారతదేశంలో కరోనా వైరస్ Covid-19 నెమ్మదిగా విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 62 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనాను నివారించేందుకు భారత్ తీవ్ర స్థాయిలో పోరాడుతోంది. భారత్ నుంచి చైనా, ఇటలీ, ఇరాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ దేశాలకు వెళ్లరాదంటూ (మార్చి 10) అర్ధరాత్రి ఆరోగ్య మంత్రిత్వ శాఖ గట్టిగా హెచ్చరించింది.

కరోనా ప్రభావిత దేశాలైన ఇటలీ లేదా రిపబ్లిక్ ఆఫ్ కొరియా నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికులు ఎవరైనాసరే తప్పనిసరిగా Covid-19 వైరస్ నెగటీవ్ అని ధ్రువీకరించిన మెడికల్ సర్టిఫికేట్ ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనా వైరస్ ను నివారించేందుకు తగిన చర్యలు చేపట్టాయి. కేరళలో ఇప్పటివరకూ 15 కరోనా కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ షట్ డౌన్ ప్రకటించారు.(కరోనా కోరలు పీకేస్తాం : ఇటలీకి చైనా వైద్యనిపుణుల బృందం )

విద్యాసంస్థలు, సినిమా హాల్స్ మూతపడ్డాయి. మార్చి 31 వరకు షట్ డౌన్ కొనసాగుతుందని తెలిపారు. ఎక్కడా కూడా ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఒకచోట ఉండరాదని కేరళ ప్రభుత్వం పలు సూచనలు చేస్తోంది. ఇటలీలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే అంశంపై కేరళ సీఎం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. మరోవైపు కర్నాటక ప్రభుత్వం కూడా తమ రాష్ట్రంలోని అన్ని స్కూళ్లను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా (PAP) విదేశీయులపై తాత్కాలిక నిషేధం విధించింది. చైనా సరిహద్దు రాష్ట్రాల్లో మిజోరంతో పాటు మయన్మార్ లో కూడా సరిహద్దులను మూసివేశారు.

See Also | ఆరోపణలు వస్తే నిరూపించుకోవాలి….రేవంత్‌రెడ్డిపై సొంత పార్టీ నేతలు ఫైర్