మద్యపానం నిషేధిస్తే మానేస్తారనుకుంటే.. ఇంకా తెగ తాగేస్తున్నారంట..!

మద్యపానం నిషేధిస్తే మానేస్తారనుకుంటే.. ఇంకా తెగ తాగేస్తున్నారంట..!

Updated On : December 18, 2020 / 11:26 AM IST

Some Indian States With Prohibition Have Higher Alcohol Consumption: మద్యపానం నిషేధిస్తే.. తాగడం మానేస్తారనుకుంటే.. అంతా రివర్స్ అయింది. ఆల్కహాల్ బ్యాన్ చేశాక ఇంకా తెగ తాగేస్తున్నారంట.. భారత్ లోని కొన్ని రాష్ట్రాల్లో మద్యపానం నిషేధించిన తర్వాతే ఆల్కాహాల్ సేవించే వారి సంఖ్య పెరిగిందని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. ఆల్కహాల్ కంజ్యుమ్షన్ కు సంబంధించి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS) 2019-20 నిర్వహించింది. ఈ సర్వేకు సంబంధించి డేటాను డిసెంబర్ 15న విడుదల చేసింది. ఇందులో ఆల్కహాల్ నిషేధిత రాష్ట్రాల్లోనే ఎక్కువగా మద్యాన్ని సేవిస్తున్నారని పేర్కొంది.

దేశంలోని పలు రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం అమల్లో ఉంది. ఆల్కహాల్ విక్రయాలను బ్యాన్ చేసినప్పటికీ బిహార్, మిజోరం, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో మరి ఎక్కువగా తాగేస్తున్నారంట.. మద్యపాన నిషేధం లేని రాష్ట్రాల్లో కంటే ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఆల్కాహాల్ సేవిస్తున్నారని అధ్యయనంలో గుర్తించారు. ఆల్కహాల్ బ్యాన్ చేసే ప్రయత్నాల్లో భాగంగా కొన్ని రాష్ట్రాలు సక్సెస్ సాధించాయి. బీహార్‌లో 2016లో సీఎం నితీశ్ కుమార్ ఆల్కహాల్ బ్యాన్ చేశారు. అయినప్పటికీ అక్రమంగా మద్యం విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. దాంతో ఈ వారమే రాష్ట్రంలో ఆల్కహాల్ నిషేధాన్ని సీఎం నితీశ్ మరింత కఠినతరం చేశారు.

NFHS సర్వేలో ఆల్కహాల్ సేల్, కంజ్యుమ్షన్ పై బ్యాన్ ఎంతవరకు సక్సెస్ అయిందో పలు విషయాలను వెల్లడించింది. ఇందులో ఎలాంటి మద్యపాన నిషేధం లేని రాష్ట్రాల్లో కంటే .. ఆల్కహాల్ నిషేధిత రాష్ట్రమైన ఒక్క బీహార్‌లోనే అత్యధిక స్థాయిలో ఆల్కహాల్ సేవిస్తున్నారని పేర్కొంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 15.8శాతంగా ఉంటే.. పట్టణ ప్రాంతాల్లో 14శాతం మంది పురుషులు మద్యాన్ని సేవిస్తున్నారని అధ్యయనంలో తేలింది.
Higher Alcohol Consumption తెలంగాణలో కూడా మద్యపానంపై ఎలాంటి ఆంక్షలు లేవు. దాంతో తెలంగాణ కూడా 43.3శాతంతో హైయిస్ట్ ర్యాంకు జాబితాలోకి చేరింది. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్ 5.8శాతంతో దిగువ స్థాయిలో ఉంది. 1961లో గుజరాత్ లో కూడా మద్యపాన నిషేధం అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ ఇక్కడి రాష్ట్రంలో ఆల్కహాల్ వినియోగం తక్కువగానే ఉంది. ఇక కేంద్రపాలిత ప్రాంతమైన లక్ష్యదీప్ లో కూడా ఆల్కహాల్ బ్యాన్ అయింది. ఇక్కడ 0.4 శాతం మంది పురుషులు ఆల్కహాల్ సేవిస్తున్నారు. మిజోరం, నాగాలాండ్ రాష్ట్రాల్లో కూడా అత్యధిక శాతంగా ఆల్కహాల్ సేవిస్తున్నారు.

నాగాలాండ్ లో 24శాతం ఉంటే.. మిజోరంలో 23.8శాతం మంది పురుషులు ఆల్కాహాల్ సేవిస్తున్నారు. మిజోరంలో పొగాకు తాగడాన్ని నిషేధించినప్పటికీ కూడా ఫస్ట్ ర్యాంకులో చేరింది. పొగాకు వాడేవారిలో 61.6శాతం మహిళలు ఉంటే.. 72.9శాతం మంది పురుషులు పొగాకును తాగుతున్నారు. ఇక గోవా, కర్ణాటకలు 10.4శాతం, 17.8శాతంతో జాబితా చివరిలో ఉన్నాయి. దేశంలో ఆల్కహాల్ వినియోగం కంటే పొగాకు వినియోగమే అత్యధికంగా ఉందని నివేదిక వెల్లడించింది. ఏపీ, తెలంగాణలో కంటే గోవాలో ఆల్కహాల్ సేవించే పురుషులు 36.9శాతం తక్కువగా ఉన్నారు.