Health Tips: ఆహారాన్ని పదే పదే వేడి చేస్తున్నారా? విషంగా మారుతుంది జాగ్రత్త

Health Tips: పదే పదే ఆహారాన్ని వేడి చేయడం వల్ల అందులోని విటమిన్ C, B విటమిన్లు, కొన్ని మినరల్స్ నశించిపోతాయి.

Health Tips: ఆహారాన్ని పదే పదే వేడి చేస్తున్నారా? విషంగా మారుతుంది జాగ్రత్త

There is a risk of poisoning from repeatedly heating food.

Updated On : July 28, 2025 / 4:35 PM IST

ప్రస్తుత సమాజంలో ప్రతీ ఒక్కరి జీవితం ఉరుకులు పరుగులుగా మారిపోయింది. వేగం ఎక్కువ, సమయం తక్కువ. కాబట్టి, ఏదైనా ఇన్స్టాంట్ గా అయిపోవాలి. కాబట్టి, చాలా మంది ఒకేసారి ఎక్కువగా వంట చేసి, మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి అవసరమైనప్పుడు మళ్లీ మళ్లీ వేడి చేసి తినే అలవాటు చేసుకుంటున్నారు. ఇది సమయాన్ని ఆదా చేసే పద్ధతిగా కనిపించినప్పటికీ ఇలా చేయడం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. పదే పదే ఆహారాన్ని వేడి చేయడం వల్ల ఆహారపు పోషకాలు తగ్గిపోవడమే కాకుండా, కొన్ని విషపదార్థాలు (toxins) కూడా ఏర్పడతాయట. మరి దాని గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

ఆహారాన్ని పదే పదే వేడి చేయడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు:

1.పోషక విలువలు తగ్గిపోతాయి:
సాధారణంగా మనం ఆహారన్ని తీసుకునేదే పోషకాలు కోసం. అలాంటిది పదే పదే ఆహారాన్ని వేడి చేయడం వల్ల అందులోని విటమిన్ C, B విటమిన్లు, కొన్ని మినరల్స్ నశించిపోతాయి. ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయల్లో పోషకాల నష్టం చాలా ఎక్కువగా జరుగుతుంది.

2.రసాయనిక మార్పులు(విషపదార్థాల ఉత్పత్తి):
మాంసాహారాన్ని పదే పదే వేడి చేయడం వల్ల అందులోని ప్రోటీన్లు పాక్షికంగా విఘటించి హానికరమైన రసాయనాలను విడుదల చేస్తాయి. నూనెలో వేయించిన పదార్థాలను మళ్లీ వేడి చేయడం వలన క్యాన్సర్‌ను కలిగించే పదార్థాలు (carcinogens) ఏర్పడే అవకాశం ఉంది.

3.జీర్ణ సమస్యలు:
మళ్లీ మళ్లీ వేడి చేసిన ఆహారం తిన్న తర్వాత కడుపులో నొప్పి, అజీర్ణం, ఉబ్బసం వంటి సమస్యలు ఏర్పడతాయి. అలాగే, ఆహారంలో జీవకణాల నిర్మాణం మారిపోతుంది, జీర్ణం కావడంలో ఆటంకం ఏర్పడుతుంది.

4.ఫుడ్ పోయిజనింగ్ ప్రమాదం:
వేడి చేయడానికి ముందు ఆహారాన్ని చల్లటి వాతావరణంలో నిల్వ చేయడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అలాంటి ఆహారాన్ని సరిగ్గా వేడి చేయకపోతే ఫుడ్ పోయిజనింగ్‌కు దారి తీస్తుంది.

5.రుచిలో మార్పు:
పదే పదే వేడి చేయడం వలన ఆహారపు సహజ రుచి, సువాసన తగ్గిపోతుంది. తినడానికి రుచికరంగా ఉండకపోవడం వలన ఆకలిని మానేసే పరిస్థితి కూడా వస్తుంది.

ఎలాంటి ఆహారాన్ని వేడి చేయకూడదు?

  • గుడ్డు
  • పాల ఉత్పత్తులు (పెరుగు, పాలు): రుచి, గుణ లక్షణాల నష్టం
  • బీట్రూట్, పాలక్, క్యారెట్
  • బాస్మతి అన్నం

జాగ్రత్తలు & మంచిపద్ధతులు:

ఆహారాన్ని సరిగా నిల్వ చేయాలి: మిగిలిన ఆహారాన్ని వెంటనే గాలి చొరబడకుండా మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టాలి.

ఒకసారి మాత్రమే వేడి చేయాలి: ఏ ఆహారాన్నైనా ఒకసారి వేడి చేసిన తర్వాత మళ్లీ వేడి చేయకుండా వదిలేయాలి.

తక్కువ మొత్తంలో వండాలి: అవసరానికి తగ్గట్టు వండటం ఉత్తమం.

వేడి చేసే ముందు శుభ్రంగా కలపాలి: ఆహారం ఎక్కడైనా పాడైపోయిన భాగం ఉంటే తొలగించాలి.