Monsoon Diet: వర్షాకాలం వీటిని అస్సలు తినకండి.. చాలా డేంజర్

వర్షాకాలంలో సిట్రస్ ఫ్రూట్స్, విటమిన్ డి,సి ఎక్కువగా ఉండే పండ్లు అస్సలు తినకుందట.

Monsoon Diet: వర్షాకాలం వీటిని అస్సలు తినకండి.. చాలా డేంజర్

Dont eat this food

Updated On : June 21, 2025 / 3:34 PM IST

వర్షాకాలం వచ్చింది అంటే చాలు అనేకరకాల రోగాలు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అందులో కొన్ని మనం తీసుకునే ఆహరం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా వర్షం కాలం తినకూడదని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటి? ఎందుకు తినకూడదు అనేది తెలుసుకుందాం.

  • వర్షాకాలంలో సిట్రస్ ఫ్రూట్స్, విటమిన్ డి,సి ఎక్కువగా ఉండే పండ్లు అస్సలు తినకుందట. సాధారణంగా ఈ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి, కానీ, వర్షాకాలం తినకూడదని అంటున్నారు. మరీ ముఖ్యంగా కట్ చేసి అమ్మే సిట్రస్ ఫ్రూట్స్ వర్షకాలంలో ఎక్కువగా కలుషితం అవుతాయంట. వాటిని తినడం వల్ల చాలారకాల సమస్యలు వస్తాయట. వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండటం మంచిది అని చెప్తున్నారు నిపుణులు.
  • బండ్లపై దొరికే సమోసాలు, బజ్జీలు, పానీపూరి లాంటివి కూడా అస్సలు తినకూడదు. వర్షాకాలం వాతావరం చాలా వరకు అపరిశుభ్రతగా ఉంటుంది. కాబట్టి బయట ఫుడ్ తినడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్స్, కడుపునొప్పి, విరేచనాలు, అజీర్తి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వర్షాకాలంలో స్త్రీట్ ఫుడ్‌కు ఎంత దూరం ఉంటే అంత మంచిది.
  • వర్షాకాలంలో కార్బోనేటెడ్ డ్రింక్స్‌కి కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిదట. కారణం ఏంటంటే? ఎక్కువ చల్లగా ఉండే కార్బోనేటెడ్ డ్రిక్స్ ఎక్కువగా తాగడం వల్ల జీర్ణసంబంధ వ్యాధులు తలెత్తుతాయట. ఇవి ద్రవ రూపంలో ఉన్నప్పటికీ కడుపులో అరగడానికి చాలా సమయం తీసుకుంటాయట. అందుకే వర్షాకాలం వీటికి దూరంగా ఉండటం మంచిది అని నిపుణులు చెప్తున్నారు.
  • వర్షాకాలంలో చాలా మంది టీ, కాఫీలు ఎక్కువగా తాగుతుంటారు. వాతావరం చల్లగా ఉంటుంది కాబట్టి ఒంటికి వెచ్చదనం కోసం టీ, కాఫీలా మీద ఆధారపడతారు. కానీ, ఎక్కువగా తాగడం వల్ల కడుపులో గ్యాస్, అజీర్తి సమస్యలు వస్తాయట. క్రమంగా ఇది పెద్ద సమస్యకు దారి తీసే అవకాశం ఉంటుందని డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి వర్షాకాలం టీ, కాఫీలు ఎక్కువగా తాగకండి.
  • చాలా మందికి పెరుగు లేదా మజ్జిగ అంటే చాలా ఇష్టపడతారు. వారికి భోజనంలో తప్పకుండ ఇవి కావాల్సిందే. కానీ, వర్షకాలంలో మాత్రం పెరుగు ఎక్కువగా తీసుకోకూడదంట. వీటిని ఎక్కవ మోతాదులో తీసుకోవడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. కాబట్టి మీ ఆరోగ్యం పట్ల మీకు శ్రద్ధ ఉంటె వర్షాకాలంలో ఈ పదార్థాలకు దూరంగా ఉండండి.