Health Tips: స్టీల్ టిఫిన్ బాక్సులో ఈ పదార్థాలు అస్సలు పెట్టకండి.. విషంగా మారతాయట.. ఎందుకో తెలుసా?
Health Tips: స్టీల్ బాక్స్ లలో పులుపు ఎక్కువగా ఉండే టమాటా పచ్చడి, లెమన్ రసం, లెమన్ రైస్, పులిహోర, అల్లం పేస్ట్, ఉల్లిపాయ పచ్చడి లాంటివి ఉంచకూడదు.

These foods should not be stored in steel boxes.
స్టీల్ టిఫిన్స్ అనేవి రోజువారీ జీవితంలో ఉపయోగించే సాధారణ సామాగ్రిగా మారిపోయాయి. ఉద్యోగం చేసేవారు మధ్యాహ్న భోజనం కోసం ఈ టిఫిన్ బాక్స్ లను ఎక్కువగా వాడుతారు. అయితే. ఇలాంటి టిఫిన్ బాక్స్ లలో కొన్ని రకాల ఆహార పదార్థాలు నిల్వ చేయడం వల్ల ఆరోగ్యానికి హానికరమైన ప్రభావాలు కలగవచ్చని నిపుణులు చెప్తున్నారు. స్టెయిన్‌లెస్ స్టీల్ యొక్క ముడి ధాతువుల ప్రభావం, ఆహార పదార్థాల్లోని ఆమ్లత వల్ల అది విషంగా మారే అవకాశం ఉందట. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
స్టీల్ టిఫిన్స్‌లో నిల్వ చేయకూడని పదార్థాలు
1.ఆమ్లపదార్థాలు:
స్టీల్ బాక్స్ లలో పులుపు ఎక్కువగా ఉండే టమాటా పచ్చడి, లెమన్ రసం, లెమన్ రైస్, పులిహోర, అల్లం పేస్ట్, ఉల్లిపాయ పచ్చడి లాంటివి ఉంచకూడదు. ఎందుకంటే.. ఈ పదార్థాలలో ఉండే ఆమ్లత స్టీల్‌ను తినేసేలా చేస్తుంది. స్టీల్ లోని నికెల్ (Nickel), క్రోమియం (Chromium) వంటి లోహాలు ఆహారంతో కలిసి ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఇది ఆహారం యొక్క రుచి, రంగును మార్చి అలర్జీలు, మైద్దులు, గ్యాస్ట్రిక్ లాంటి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
2.ఉప్పు ఉండే పదార్థాలు:
ఆవకాయ పచ్చడి, మాగాయి, ఉప్పు ఉల్లిపాయలు వంటి వారిని కూడా స్టీల్ బాక్స్ లలో ఉంచకూడదు. ఉప్పు స్టీల్ పై రసాయనిక ప్రతిస్పందన కలిగేలా చేస్తుంది. దీని వల్ల స్టీల్ సులభంగా తుప్పు పట్టే ప్రమాదం ఉంది.
3.ఫెరమెంటెడ్ పదార్థాలు:
ఇడ్లీ, దోస పిండులు, అంబలి వంటి పదార్థాలను కూడా స్టీల్ బాక్స్ లలో ఉంచకూడదు. ఇవి కొన్ని గంటల తరువాత పుల్లగా మారే అవకాశం ఉంది. అవి స్టీల్ తో కలసినప్పుడు అశుద్ధమైన పదార్థాలుగా మారుతుంది. నిష్క్రియ (reaction) వల్ల స్టీల్ యొక్క పరిమాణం తగ్గి ఆహరం అశుభ్రంగా మారుతుంది.
4.డైరీ ఉత్పత్తులు:
స్టీల్ బాక్స్ లలో పులుపు ఎక్కువగా ఉండే టమాటా పచ్చడి, లెమన్ రసం, లెమన్ రైస్, పులిహోర, అల్లం పేస్ట్, ఉల్లిపాయ పచ్చడి లాంటివి ఉంచకూడదు. స్టీల్ బాక్స్ లలో పెరుగు, పాలు, పన్నీర్ లాంటి వాటిని కూడా ఎక్కువసేపు ఉంచకూడదు. పాలు ఉత్పత్తులు స్టీల్‌తో కలిసి వాసన, రుచి మారిపోవచ్చు. పెరుగు త్వరగా ఆమ్లపదార్థాలుగా మారి ప్రతికూల ప్రభావం చూపుతాయి.
ఏవి నిల్వ చేయవచ్చు?
- పొడిపదార్థాలు (అన్నం, చపాతీ, డ్రై కర్రీలు)
- తక్కువ ఆమ్లత కలిగిన వంటలు (ఉప్మా, పులగం, కొంతవరకు వేపుడు ఐటమ్స్)
- తినగలిగే పొడి పదార్థాలు (చిక్కుడు గింజలు, శనగలు మొదలైనవి)
ఉపయోగపడే సూచనలు
- స్టీల్ బాక్స్ లను ఎప్పటికప్పుడు బాగా శుభ్రపరచుకోవాలి.
- ఆమ్ల పదార్థాలు పెట్టాలనుకుంటే ప్లాస్టిక్, గాజు డబ్బాలను ఉపయోగించండి.
- ఆహారాన్ని ఎక్కువసేపు బాక్స్ లలో ఉంచకూడదు.