తినే వంటకాలు, తాగే కప్పులు షేర్ చేసే అలవాటు ఉందా? కరోనా సోకడానికి మూడింతలు అవకాశం.. సైంటిస్టుల హెచ్చరిక

ఆహారపు అలవాట్లే ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయి.. తరచూ అనారోగ్యానికి గురవతున్నారంటే అది ఆహారపు అలవాట్లే కారణం కావొచ్చు..
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మంచి అలవాట్ల కంటే ఆహారం విషయంలో అరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లే ఎక్కువగా డేంజర్ అంటున్నారు.. చిన్నప్పటి నుంచి ఆహార అలవాట్ల విషయంలో పెద్దలు ఎన్నోసార్లు హెచ్చరించి ఉంటారు.
అయిన పద్ధతులు మార్చుకోరు.. ఫాస్ట్ ఫుడ్ వంటి వంటకాలపై కోరికను చంపుకోలేరు.
కరోనా సంక్షోభ సమయంలో ఇలాంటి ఆహారపు అలవాట్లే మహమ్మారి బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓ అధ్యయనం హెచ్చరించింది. ప్రత్యేకించి తినేటప్పుడు.. తాగేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.
ఒకరి వంటకాలు లేదా టీ కప్పులు మరొకరు షేర్ చేసుకోవడం ద్వారా కరోనా వైరస్ సోకడానికి మూడింతలు అవకాశం ఉందని అధ్యయనం తేల్చింది.
థాయిలాండ్ లోని అధ్యయన బృందం.. 211 కరోనా కేసులు, 839 కోలుకున్నవారిపై అధ్యయనం చేసింది.
ఎవరైతే ఫేస్ మాస్క్, హ్యాండ్ వాషింగ్ చేయలేదో వారికే ఎక్కువగా కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. ప్రత్యేకించి.. తమ వంటకాలు, టీ కప్పులను ఒకరినొకరు షేర్ చేసుకోవడం ద్వారా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని నిర్ధారించారు.
వంటకాలు, కప్పులను షేర్ చేసుకున్న వారిలో 2.71 సార్లు కరోనా సోకినట్టు తేలింది.
ఇతర ప్రాంతాల్లో పనిచేసే చోట కంటే ఎక్కువగా ఇంట్లోనే ఉండేవారి ద్వారే ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని అధ్యయన బృందం వెల్లడించింది.
ఒకవేళ ఇంట్లోని ఒకరికి కరోనా సోకితే.. ప్రత్యేకించి ఒక రూంలో ఉండాలి.. ప్రత్యేక బాత్ రూం కేటాయించాలి. సాధ్యపడితే.. వంటకాలు, కప్స్ ఇతర గిన్నెలు, పాత్రలను షేర్ చేసుకోవద్దని సూచిస్తున్నారు.
రాత్రి విందు కార్యక్రమాల్లో వంటకాలు, కప్స్ షేర్ చేసుకోవద్దని థాయిలాండ్ నగరవాసులను హెచ్చరించింది.
కూల్ డ్రింక్స్, సిగరేట్లను షేర్ చేసుకున్న కొందరు స్నేహితుల్లో 13 మందికి కరోనా వైరస్ సోకినట్టు మార్చిలో రిపోర్టు వెల్లడించింది.
CDC అధ్యయనం ప్రకారం.. సిగరేట్లను షేర్ చేసుకోవడం ద్వారా కరోనా సోకడానికి 6.12 రెట్లు అధికంగా అవకాశం ఉందని హెచ్చరించింది.
నైట్ పార్టీల్లో ఒక గ్లాస్ ఆల్కాహాల్ ను మరో గ్రూపుకు షేర్ చేయడం ద్వారా ధాయిలాండ్ లో 11 కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనాను చంపే ఆల్కహాల్ తాగినప్పటికీ వారికి కరోనా సోకిందని డేటా వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ఆల్కహాల్ గ్లాసు ముట్టుకోలేదో వారు వైరస్ బారిన పడలేదు.