ఈ సింపుల్ టిప్ పాటిస్తే 40% కరోనా సోకదు.. అది మాస్క్ మాత్రం కాదు!

ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ భారతదేశంపై పంజా విసిరింది. కరోనా వైరస్ బాధితుల సంఖ్య కమ్రంగా పెరుగుతోంది. అదృష్టవశాత్తూ ఇప్పటివరకూ ఆరు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా వ్యాప్తి పరిమితంగానే ఉందని చెప్పాలి. అయినప్పటికీ అతిపెద్ద జనాభా గల దేశమైన భారతదేశంలో కరోనా వైరస్ ముప్పు పొంచి ఉంది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించే కరోనాను ముందుస్తు జాగ్రత్త చర్యలతో అదుపులో ఉన్నట్టుగానే కనిపిస్తోంది.
నివారణకు ఒక సింపుల్ టిప్ చెప్పిన లిప్కిన్ :
కరోనా వ్యాప్తిని నివారించాలంటే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే నివారణ సాధ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత వైరాలిజిస్టుల్లో ఒకరైనా డాక్టర్ డబ్ల్యూ ల్యాన్ లిప్ కిన్ కరోనా వైరస్ వ్యాప్తిపై జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ కొత్త వైరస్ ఎలా సోకుతుంది అనేదానిపై ఆయన వివరణ ఇచ్చారు. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ఎన్ని పరిమిత దారులు ఉన్నాయో విశ్లేషించారు. పలు టిప్స్‌లో సింపుల్ టిప్ ఒకటి చెప్పారాయన. (‘సేవ్ ఫ్రమ్ కరోనా ఇన్‌ఫెక్షన్ మోడీజీ’ : ఇలాక్కూడా వాడేసుకుంటున్నారు)
అదే.. మీ ముఖాన్ని తరచూ తాకొద్దు… చాలామంది తమకు తెలియకుండానే తమ ముఖంపై రోజుకు వందల సార్లు చేతులతో తాకుతుంటారు. కళ్లు రుద్దుకోవడం.. చెంపలపై చేతులతో రుద్దుకోవడం.. దురద లేకపోయినా అలవాటుగా ప్రతిసారి ముఖంపై చేతులను పెడుతుంటారు. ఇలా పదేపదే చేతులతో ముఖాన్ని తాకడం ద్వారా కరోనా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన హెచ్చరిస్తున్నారు. ముఖంపై చేతులు పెట్టుకోవడం తాకకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే వారిలో వైరస్ సోకడాన్ని 40 శాతం వరకు తగ్గిస్తుందని స్పష్టం చేశారు. ‘ప్రతిరోజు చాలా మంది వందల సార్లు తమ ముఖాన్ని తాకుతుంటారు. ఒకవేళ వారు తమ ముఖాలను చేతులతో తాకకుండా ఉండగలిగితే వారిలో వైరస్ సోకే అవకాశాలను చాలావరకు తగ్గిస్తుంది’ అని లిప్ కిన్ వివరించారు.
తనకు తానే రెండు వారాలు నిర్బంధం :
యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జీలోని జాన్ స్నో ప్రొఫెసర్ ఆఫ్ ఎపిడెమియాలజీకి చెందిన డాక్టర్ లిప్ కిన్… గత ఏడాదిలో చైనాలో ఏదో పని నిమిత్తం వెళ్లిన వచ్చిన తర్వాత తనకు తానే రెండు వారాల పాటు నిర్భంధించుకున్నారు. తన 30ఏళ్ల వైద్యా అనుభవంలో ఆయన ఎన్నో వైరస్‌లపై స్పందించి బాధితులకు తన వంతు వైద్య సాయం అందించారు. మాలిమాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లోని ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యూనిటీ కేంద్రానికి డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. వైరస్ వ్యాప్తిపై ప్రజలకు సలహాలు సూచనలను లిప్కిన్ ఇస్తున్నారు. ఒకవేళ మీరు అనారోగ్యం ఉన్నామని ఫీల్ అయితే.. మీకు మీరుగా ప్రత్యేకమైన ప్రదేశంలోకి వెళ్లిపోండి’ అని సూచించారు.
చేతికి గ్లోవ్స్ ధరించడం తప్పనిసరి :
వైరస్‌లు ఎల్లప్పుడూ అభివృద్ధి, పరివర్తన చెందుతుంటాయని, పర్యావరణానికి అనుగుణంగా వైరస్ లు మారిపోతుంటాయని ఆయన అన్నారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్టును వినియోగించుకునేవారంతా తప్పనిసరిగా తమ చేతికి గ్లోవ్స్ ధరించాలని కోరారు. కరోనావైరస్ నుండి కోలుకున్న వారంతా ప్లాస్మా బ్యాంకులకు ప్లాస్మాను అందించాలని వైరోలజిస్ట్ డాక్టర్ ఇయాన్ లిప్కిన్ అన్నారు. ఇది కరోనావైరస్ చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుందని చెప్పారు.
కోలుకున్న రోగుల నుండి పొందిన ప్లాస్మా.. ప్రాణాంతక వ్యాధికారకానికి పెద్ద పరిమాణంలో యాంటీబాడీస్ కలిగి ఉంటుంది. దానం చేసిన రక్తం నుండి, బాధితుడి శరీరాన్ని ఆక్రమించే ప్రాణాంతక వ్యాధికారక క్రిములతో పోరాడటానికి యాంటీబాడీస్ క్రియేట్ చేయడానికి ప్లాస్మాను వినియోగిస్తుంటారు. తన 30ఏళ్ల అనుభవంలో ఎన్నో వైరస్ లను చూసిన లిప్కిన్.. ప్రపంచంలో అత్యంత వ్యాప్తికారక వైరసుల్లో కరోనా వైరస్ ఒకటిగా చెప్పారు.