Rock Salt Health Benefits: రాక్ సాల్ట్ తో ఆరోగ్యం.. మాములు ఉప్పుతో ముప్పు.. ఎందుకో తెలుసా?
Rock Salt Health Benefits: రాక్ సాల్ట్.. ఇది భూమిలో సహజంగా ఏర్పడిన ఉప్పు. ఇది ప్రాచీన సముద్రపు జలాలు కొండరూపంలో మిగిలినప్పుడు ఏర్పడుతుంది.

Health benefits of Rock salt
ఉప్పు మనం రోజు వాడే ఆహార పదార్థాలలో ప్రధానమైనది. ఇది లేకుంటే వంట రుచి రాదు. అందుకే ఉప్పును వంటల్లో ప్రధానమైనదిగా చెప్తారు. కానీ ఇది ఆరోగ్యంపై వేసే ప్రభావాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. సరైన ఉప్పు ఎంపిక మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుంది. లేదంటే, దీర్ఘకాలిక వ్యాధులకు కారణం అయ్యే ప్రమాదం ఉంది. ఇక మనం వాడుకునే ఉప్పులో రెండు రకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి రాక్ సాల్ట్. రెండవది మాములు ఉప్పు. ఈ రెండు అప్పుల మధ్య తేడాలు, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
అసలు ఉప్పు అవసరం ఏంటి?
చాలా మంది ఉప్పు అంటే కేవలం రుచి కోసమే వాడతారు అనుకుంటారు. కానీ, ఇది శరీరంలోని చాలా వ్యవస్థలను కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా శరీరంలో నీటి సమతుల్యత, నాడీ వ్యవస్థ పనితీరు, పోటాషియం-సోడియం మ్యూచువల్ రేషియో, పేగుల లోపల ఆమ్లాన్ని నియంత్రించటం వంటి అనేక పనులను సమన్వయం చేస్తుంది ఉప్పు. అందుకే మానిషి ఆరోగ్యానికి ఉప్పు చాలా అవసరం. కానీ, మనం తీసుకుంటున్న ఉప్పు సరైనది ఎంచుకోకపోతే అదే పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతుంది.
అసలు రాక్ సాల్ట్ అంటే ఏమిటి?
రాక్ సాల్ట్.. ఇది భూమిలో సహజంగా ఏర్పడిన ఉప్పు. ఇది ప్రాచీన సముద్రపు జలాలు కొండరూపంలో మిగిలినప్పుడు ఏర్పడుతుంది. దీనిని ఎలాంటి శుద్ధి చేయకుండా అదే విధంగా వాడతారు. దీనిలో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, జింక్, కాపర్, మాంగనీస్ వంటివి అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని అందిస్తాయి.
మామూలు ఉప్పు అంటే ఏమిటి?
మామూలు ఉప్పు.. దీనిని సముద్రపు నీటిని సేకరించి అధిక ఉష్ణోగ్రతలతో ఏపండబెట్టి ప్యూరిఫికేషన్ చేసి తయారు చేస్తారు. ఇందులో సోడియం క్లొరైడ్ 97-99% మాత్రమే ఉంటుంది. మరింత మెరుగు కోసం యాంటీకేకింగ్ ఏజెంట్లు, ఐఒడిన్, కిమికల్ బ్లీచింగ్ ను వాడతారు. లా చేయడం వల్ల ఉప్పులో సహజంగా ఉండే ఖనిజాలు తొలగించబడతాయి.
రాక్ సాల్ట్ ఆరోగ్య ప్రయోజనాలు:
బీపీని నియంత్రిస్తుంది: రాక్ సాల్ట్‌లో సోడియం తక్కువగా ఉంటుంది కాబట్టి హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవారికి ఇది మంచి ఆప్షన్ అనే చెప్పాలి.
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది: రాక్ సాల్ట్ ఆమ్లాన్ని తగ్గిస్తుంది. కాబట్టి అజీర్తి, గ్యాస్, ఆమ్లపిత్తం సమస్యలకు ఉపశమనం కలుగుతుంది.
బాడీని డిటాక్సిఫికేషన్ చేస్తుంది: రాక్ సాల్ట్ శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. అందుకే దీనిని ఉపవాస సమయంలో ఎక్కువగా వాడతారు.
చర్మ సమస్యలకు చెక్: రాక్ సాల్ట్ యాంటీసెప్టిక్‌గా కూడా పనిచేస్తుంది. బాత్ వాటర్‌లో కలిపితే చర్మ సమస్యలను దరిచేరనియ్యదు.
మెటాబాలిజాన్ని పెంచుతుంది: ట్రేస్ మినరల్స్ శరీర మాడ్యుల్స్ పని తీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
థైరాయిడ్ సమస్యకు ఉపశమనం: రాక్ సాల్ట్‌లో సహజ ఐఒడిన్ తక్కువగా ఉంటుంది. ఇది థైరాయిడ్ సమస్యను తగ్గిస్తుంది.
మామూలు ఉప్పు ప్రమాదం:
- ఇందులో ఉండే అధిక సోడియం వల్ల బీపీ పెరుగుతుంది.
- ఇది మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతుంది.
- ఈ ఊపులో నేచురల్ మినరల్స్ లేకపోవడం వల్ల పోషకల లోపం ఏర్పడుతుంది.
- ఇందులో ఉండే ఆంటీకేకింగ్ ఏజెంట్లు నరాలకు హానికరం కావచ్చు.
ఆరోగ్యానికి రాక్ సాల్ట్ మంచిది.
- రాక్ సాల్ట్ ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది. ఎందుకంటే ఇది సహజమైనది.
- అధిక మినరల్స్ కలిగి ఉంటుంది
- మృదువైన రుచి కలిగి ఉంటుంది
- ప్రాసెసింగ్ తక్కువగా ఉంటుంది.