Premature Baby Care Tips : నెలలు నిండకుండానే పిల్లలు పుడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ?

సరైన ఉష్ణగ్రత శిశువుకు అందేలా చూడాలి. బిడ్డ సౌకర్యవంతమైన, సురక్షితమైన ఉష్ణోగ్రతలో ఉండేలా చేతులకు, కాళ్లకు గ్లౌజ్‌లు వేయాలి. మెత్తని దుప్పటి కప్పాలి. గది టెంపరేచర్‌ తక్కువగా ఉంటే హీటర్‌ పెట్టి.. ఉష్ణోగ్రత మెయింటెన్ చేయాలి.

Premature Baby Care Tips : నెలలు నిండకుండానే పిల్లలు పుడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ?

Preterm Baby Care

గర్భిణీ స్త్రీలలో చాలా మంది నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిస్తుంటారు. సుమారు 11% మంది శిశువులు నెలలు నిండకుండానే ముందస్తుగా జన్మిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఐదేళ్లలోపు పిల్లలలో మరణానికి అత్యంత సాధారణ కారణం ఈ ప్రీమెచ్యూరిటీ సమస్యలేనని నిపుణులు చెబుతున్నారు. పేద,మధ్యస్ధ ఆదాయం కలిగిన దేశాలలో ప్రతి సంవత్సరం దాదాపు ఒక మిలియన్ మంది నెలలు నిండని శిశువులు మరణిస్తున్నట్లు తేలింది.

READ ALSO : sweet potatoes health benefits : వీటిని తింటే క్యాన్సర్ తో సహా దీర్ఘకాలిక వ్యాధులనుండి రక్షణ పొందొచ్చు తెలుసా !

పిల్లలు నెలలు నిండకుండా పుట్టడానికి చాలా కారణాలు అనేకం ఉన్నాయి. ఐవీఎఫ్, డయాబెటిస్, బీపీ, కలుషిత వాతావరణం, అంటువ్యాధులు. గర్భిణులు పౌష్టిక ఆహారం తీసుకోకపోవటం, సమయానికి తినకపోవటం, మందులు వాడడంలో, వ్యక్తిగత శుభ్రత విషయంలో జాగ్రత్తలు పాటించకపోవటం వంటి వాటి వల్ల పిల్లలు నెలలు నిండకుండా పుట్టే అవకాశం ఉంటుంది.

నెలలు నిండకుండా పుట్టిన శిశువుల సంరక్ష విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇలా పుట్టిన శిశువులు సున్నితంగా ఉంటారు. వారిని కంటికి రెప్పలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్లు దరిచేరకుండా చూసుకోవటం చాలా కీలకం. నెలలు నిండకుండానే జన్మించే వారిలో శరీర భాగాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందవు. అలాంటి వారిని ఇంక్యుబేటర్‌ ఇంక్యుబేటర్‌లో ఉంచి చికిత్స అందిస్తారు. ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. 37 వారాలకంటే ముందు పుట్టే పిల్లలు ప్రి మెచ్యూర్‌ కోవలోకి వస్తారు. 28 వారాల లోపే పుట్టే పిల్లలు ఎక్స్‌ట్రీమ్‌ ప్రి మెచ్యూర్‌ బేబీలుగా చెప్పవచ్చు.

READ ALSO : నెలల నిండకముందే పుట్టేస్తున్న శిశువులు..అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు..!!

తీసుకోవాల్సిన జాగ్రత్తలు ;

1. సరైన ఉష్ణగ్రత శిశువుకు అందేలా చూడాలి. బిడ్డ సౌకర్యవంతమైన, సురక్షితమైన ఉష్ణోగ్రతలో ఉండేలా చేతులకు, కాళ్లకు గ్లౌజ్‌లు వేయాలి. మెత్తని దుప్పటి కప్పాలి. గది టెంపరేచర్‌ తక్కువగా ఉంటే హీటర్‌ పెట్టి.. ఉష్ణోగ్రత మెయింటెన్ చేయాలి.

2. శిశువులకు 6 నెలల వయస్సు వరకు ప్రత్యేకంగా తల్లిపాలు (EBF) ఇవ్వాలి.

3. తల్లి స్వంత పాలు అందుబాటులో లేనట్లయితే వైద్యుల సలహామేరకు సూక్ష్మపోషకాలు, ఐరన్ సప్లిమెంటేషన్, జింక్ సప్లిమెంటేషన్, విటమిన్ డి సప్లిమెంటేషన్ మరియు విటమిన్ ఎ సప్లిమెంటేషన్ అందించవచ్చు.

READ ALSO : Symptoms of Diabetes : వివిధ వయస్సుల వారిలో మధుమేహం లక్షణాలు ఏవిధంగా ఉంటాయంటే !

4. ముందస్తుగా పుట్టిన శిశువులకు కంగారూ మదర్‌ కేర్‌ పద్ధతిని తల్లి అనుసరిచాలి. అనగా కంగారు తన పిల్లను ఎలా ఛాతికి అంటుకునేలా ఉంచుకుంటుందో అదేపద్దతి. ఛాతీకి హత్తుకునేలా చిన్నారిని పడుకోబెట్టాలి. దీనివల్ల బిడ్డ శరీరం వెచ్చగా ఉండడంతో పాటు వారిలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

5. రోజులో బిడ్డకు కనీసం 8 నుంచి 10 సార్లు తల్లి పాలు ఇవ్వాలి. పాలు సమయానికి ఇస్తున్నారో లేదో జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక వేళ తల్లి పాలు చాలాకపోతే ప్రీ టెర్మ్‌ ఫార్ములా మిల్క్ ఇవ్వొచ్చు.

READ ALSO : అతి నిద్ర కారణంగా గుండె జబ్బుల ప్రమాదం?

6. సాధారణ పిల్లల కంటే రాత్రుళ్లు నెలలు నిండకుండా పుట్టిన శిశువులు ఎక్కువ సార్లు ఆకలికి లేస్తుంటారు. తరచుగా పాలు పడుతుండాలి. ఇలా చేస్తే వాళ్లు ఎక్కువగా నిద్ర పోతారు.

7. ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఎక్కువగా ఉన్నందున గది శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. చేతులు శుభ్రం చేసుకోకుండా ఎవరూ బిడ్డను ముట్టుకోరాదు.

READ ALSO : Amavasya : అమావాస్య రోజున కొంతమంది విచిత్రంగా ప్రవర్తించటానికి కారణం ఏంటంటే?

8. నెలలు నిండక ముందు జన్మించిన పిల్లలు పుట్టిన మొదటి ఆరు నెలల వరకు ఎలాంటి ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. ప్రయాణాల వల్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

9. రోజు స్నానం చెయించకూడదు. పొడి బట్టను నీళ్లలో ముంచి శిశువు శరీరాన్ని తుడవాలి. ఎలాంటి లోషన్లు, ఆయిల్స్‌ వాడకపోవడమే మంచిది.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలో బాధపడుతున్న వారు వైద్యుల సూచనలు, సలహాలు పొందటం మంచిది.